నిజమైన విధ్యాభ్యాసం : True Education

23/02/2010 11:43

                  విధ్యలేని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. అంటే విధ్య ఎంత ప్రముఖ్యమో గ్రహించండి. కేవలం చదవటం వ్రాయటం కొంచం వస్తే విధ్యావంతులవరు. విధ్య అంటే జ్ఞానం (చదవటం వ్రాయటం, లోతైన విషయాలను అర్ధం చేసుకొనే జ్ఞానం, సమకాలీన ప్రపంచ జ్ఞానం, సైన్సు, కుటుంబ జీవితం మొదలైనవి). ఈ లోక విధ్య మనకు ఉద్యోగాలైతే తెచ్చిపెడుతుంది గాని మంచి బుద్దిని, వ్యక్తిత్వాన్ని లేదా మంచి నైజంని(మంచి character) గాని లేదా సరైన ఆలోచనా ధృక్పదాన్ని మనలో తేవడం లేదు. ఎందుకంటే భోధంచేవారు అలానే భోధిస్తున్నారు వినేవారు అలానే వింటున్నారు. కాబట్టి మంచి మంచి డిగ్రీలు ఉన్నవారు అందరు విధ్యావంతులు కారు. అలానే పెద్ద పెద్ద ఉద్యోగాలున్న వారందరూనూ విధ్యావంతులు కారు.

                విధ్య అంటే జ్ఞానం. అది రెండు రకాలు. భూసంబందమైనది మరియు పరలోక సంబందమైనది. భూసంబందమైనది మనం చిన్ననాటి నుండి పంచేద్రియాల ( 5 senses) ద్వారా సంపాదించే జ్ఞానం "ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల (జ్ఞానము) వంటిదియునై యున్నది (యాకోబు 3:15)". పరలోక సంబందమైనదేమో కేవలం దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో దేవుడు ఇచ్చే ప్రత్యక్షత( Understanding or Revelation). “అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనునది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది (యాకోబు 3:17)".

            మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు సకల విధ్యలనభ్యసించాడు. "మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడైయుండెను. (అ.కా 7:22)". తరువాత ఐగుప్తును విడిచి 40 సంవత్సరాలు గొర్రెలను కాచాడు. కేవలం ఈ లోక విధ్య మోషేకు ఇశ్రాయేలీలను విడిపించటానికి ఉపయోగపడలేదు. యేసు ఏర్పరచుకొనిన శిష్యులలో కొందరు విధ్యలేని పామరులు. "వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులనిగ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడ ఉండినవారని గుర్తెరిగిరి (అ.కా 4:13)". అయితే వారు అలానే ఉండలేదు. క్రమంగా విధ్యావంతులైనారు. దేవుని వాక్యంలో చోటు సంపాదించారు. కాబట్టి విధ్య అనేది క్రైస్తవులుగా మనకు చాలా ముఖ్యం. దేవుని వాక్యం అర్ధం కావా లంటే భూసంబందమైన జ్ఞానం కావాలి దానిపైన పరలోకసంబందమైన జ్ఞానం పొందుటకు అర్హత(నిజమైన మారుమనస్సు) సాధించాలి. అపోస్తులుడైన పేతురు చాలా చాలా clear గా విధ్య గురించి చెప్పాడు. విధ్య లేకపోతే క్రైస్తవ జీవితం కొనసాగించడం చాలా కష్టం అన్నాడు. ".....ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానముచొప్పున మీకు వ్రాసియున్నాడు. వీటినిగూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులును అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.(2 పేతురు 3:15-17)".

            అబద్దబోధ అంటే ఏమిటి? దేవుని వాక్యంలో లేని బోధ. ఉదాహరణకు క్రిస్మస్. విద్యావిహీనులును అబద్ధబోధలు బోధించనూ వచ్చు లేదా అబద్దబోధలు విని నమ్మి మోసపోనూవచ్చు. "మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును (గలతి 6:7)" .కాబట్టి పేతురువలే నిజంగా విధ్యావంతులవుటకు ప్రయాసపడవలెను. దేవునియందు నిజమైన భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలం!!!!