దేవుని రాజ్యము : Kingdom of God

18/02/2010 11:20

          దేవుని సువార్త తెలుసుకోకుండా ఎవరును పరలోక రాజ్యాన్ని చేరలేరు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త యేసుక్రీస్తు ప్రకటించెను. కాని ఈ సువార్త చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా, దేవుని కుటుంబమన్నా, రక్షింపబడటమన్నా, దేవుని ప్రధమ ఫలమన్నా, నిత్యజీవమన్నా, తిరిగి జన్మించడమన్నా ఒకటే.

        ఇశ్రాయేలు ప్రజలందరు ఒక వ్యక్తి (యాకో బు) సంతానం. ఒకే కుటుంబం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిభంధన చేశాడు. మోషే దానికి మధ్య వర్తి. అప్పుడు ఆ ఒకే కుటుంబం ఇశ్రాయేలు రాజ్యము గా ఏర్పడింది. తరువాత దేవుడు తన కుమారున్ని లోకానికి పంపి రాజ్యసువార్త ప్రకటించడం ద్వారా నూతన నిబంధన చేశాడు. దేవుని రాజ్యములో కేవలం ఆత్మసంబంధులైన దేవుని కుమారులు మాత్రమే ఉంటారు. “....ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు(1 కోరింథి 15:50)”. ఆనాటి ఇశ్రాయేలు రాజ్యమేమో మానవ కుంటుంబం కాని దేవుని రాజ్యమేమో దేవుని కుటుంబము (తిరిగి జన్మించిన దేవుని కుమారుల కుటుంబం). 

దేవుని కుటుంబం

          ఈ దేవుని రాజ్యసువార్తను అంగీకరించి మన పాపల విషయమై పశ్చాతాపపడినప్పుడు దేవుని పరి శుద్ధాత్మను పొందుకుంటాం. దేవున్ని మనం తండ్రి అని పిలువవచ్చు. అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాము. ఇంకా దేవుని వారసులం అవుతాము. అంతేకాదు మనం యేసుక్రీస్తుతో సహవారసులం అవుతాం. “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింప బడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయన గా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృతపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయనా తండ్రీ అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోటి వారసులము.  (రోమా 8:14-17)”. ఇలాంటి దేవుని కుమారుల కొరకు ఈ సమస్త సృష్టి వేచిచూస్తూ ఉంది. “దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. (రోమా 8:19)”.

ప్రవక్తయైన దానియేలు ముందే చెప్పెను

        ప్రవక్తయైన దానియేలు దేవుని రాజ్యము గురించి వ్రాశాడు. మొట్టమొదటి ప్రపంచ చక్రవర్తియైన నెబుకద్నెజరు కనిన కలకు దానియేలు భావం తెలియజేసాడు. ఆ యొక్క కలలో ఆ రాజు ఒక ప్రతిమను చూసెను. ఆ కల యొక్క భావం ఈ విధంగా తెలియ జేసెను. “ఆ కల 5 ప్రపంచ రాజ్యములను గూర్చి తెలియజేయుచున్నది. మొదటిది కల్దీయుల రాజ్యము (బబులోను రాజ్యము), రెండవది పర్షియ రాజ్యము, మూడవది గ్రీకుమాసిదోని య రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యము, ఇంక ఐదవది దేవుని రాజ్యము. మొదటి నాలుగు రాజ్యాలు అలా వచ్చి పోతాయి కాని ఐదవ రాజ్యమునకు నశింపు లేదు మరియు యుగయుగములు నిలుచును. “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. (దానియేలు 2:44)”. మొదటి నాలుగు రాజ్యాలు భూసంబంధమైన రాజ్యాలు. కాని ఐదవది దేవుని సంబంధమైనది. దానికి అంతమే ఉండదు. దానిని ఏలువారు పరిశుద్ధులు. “ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోక మందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను (రాజ్యములను) సూచించుచున్నవి. అయితే మహో న్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగ యుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. (దానియేలు 7: 17,18)”. పరిశుద్ధులు అంటే ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన వారు. “అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగా జన్మించి తేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహాను 3:3)”. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త విని రక్షింపబడి నిత్యజీవం పొందినవారు. వారు యేసుక్రీస్తుతో పాటు రాజ్యాన్ని యుగయుగములు ఏలుదురు. “.....ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల పర్యంతము ఏలుననెను. (ప్రకటన 11:15)”.  

        కనుక దేవుని రాజ్యము అంటే యేసుక్రీస్తుతోపాటు పరిపాలన చేయువారు ఆత్మసంబంధముగా తిరిగి జన్మించిన పరిశుధ్ధులు. అంటే దేవుని ప్రధమ ఫలము లు. అంటే దేవుని ప్రపంచ ప్రభుత్వము. “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో(యేసు) కూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. (ప్రకటన 3:21)”. యేసుక్రీస్తు రెండవరాకతో దేవుని రాజ్యము ఏర్పడుతుంది. ఇదే మొదటి పునరుద్ధానము. దేవుని రాజ్యము ఏర్పడినమొదటి 1000 సం||రాలు ఈ భుమి మీద పరిపాలన జరుగును. “ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యముచేయుదురు. (ప్రకటన 20:6)”. పాలించేవారే మో యేసుక్రీస్తు మరియు ఆత్మ సంబందులు ( దేవుని కుటుంబం అంటే తిరిగి జన్మించిన పరిశుద్ధులైన రాజు లైన యాజకులు) పాలింపబడేవారేమో మానవులు.

దేవుని రాజ్యములో ఎవరెవరు ఉంటారు

        రాజ్యమంటే ఒక దేశం. రాజ్యంలో 1) ప్రజలు మరియు 2) రాజ్యాన్ని పాలించే ప్రభుత్వము ఉంటాయి. దేవుని రాజ్యమంటే యేసుక్రీస్తు మరియు ఆయనయందు విశ్వాసముంచిన పరిశుధ్దులందరు పాలించే ప్రభుత్వ ము. యేసుక్రీస్తు సువార్త ప్రకటనతో మనలను పిలిచి, మన పాప పరిహారార్ధం తన ప్రాణం పెట్టి తన శిష్యులనుగా చేసికొని తన సొంత కుటుంబముగా మనలను ఏర్పరచుకొన్నాడు. “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. (1 పేతురు 2:9)”. మరియు “నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశ ములోను, ఆ యా భాషలు మాటలాడువారలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మను ష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులగాను చేసితివి (ప్రకటన 5:10)”. 

        ఆదాము మొదలుకొని దేవుని భక్తులందరు దేవుని రాజ్యములో ఉంటారు.“అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకలప్రవక్తలును దేవుని రాజ్యములో నుండుటయు, మీరు వెలపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. (లూకా 13:28)”. అంతే కాకుండా క్రీస్తును ఎరిగిన అన్యజనులు భూమియొక్క సమస్త దిశల నుండి వచ్చి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు. “మరియు జనులు తూర్పునుండియు పడమట నుండియు ఉత్తర మునుండియు దక్షిణమునుండియు వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. (లూకా 13:29)”. దేవుని రాజ్య సువార్త కొరకు ప్రయాసపడే వారు ఖచ్చితంగా ఇహమందును పరమందును ఆశీర్వదించబడతారు. “ఆయన -దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ముల నైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. (లూకా 18:29,30)”. అయితే కొందరు పరిసయ్యలు దేవుని  రాజ్యమెప్పుడువచ్చునని యేసుక్రీస్తుని అడిగినప్పుడు అది మీ మధ్యలోనే ఉందని మరియు మీకు అందుబాటులోనే ఉందని(ఉన్నానని) చెప్పినాడు. “ఇదిగో దేవునిరాజ్య ము మీ మధ్యనే యున్నది (లూకా 17:21)”.

దేవుని రాజ్యములో ప్రవేశం ఎవరికి లేదు

             పరిశుద్ధ జీవితం కొరకు ఆసక్తి కలిగి చిన్నపిల్లవానిని మనం ఇష్టపడినట్లు సువార్తను అంగీకరించవలెను. లేనిచో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు. “చిన్నపిల్లవలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో నెంతమాత్రమును ప్రవేశింపడని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నాననెను. (లూకా 18:17)”. ఈ లోకంలో ఆస్తిగల వారి మనస్సులు ఎప్పుడు తృప్తి చెందవు. వారు మారుమనస్సు పొందడం చాలా చాలా కష్టం. “....ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించు ట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సుళభమని చెప్పెను. (లూకా 18:24,25)”. కేవలం పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్య ములోకి వస్తారు. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు రావడం అసంభవం. “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనముగలవారైనను (మాడాలు), పురుషసంయోగులైనను(గేస్ Gays) దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. (1కొరింథి 6:9,10)”.

        శరీరంతో చేసిన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవడం వలన మనకు దేవునితో తండ్రి కుమారుల/కుమార్తెల సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మన మనస్సు పరిశుద్ధపరచబడి దేవుని విషయాలను అర్ధం చేసుకొనే సామర్ధ్యం పొందుతుంది. అయితే శరీరకార్యాలను చేయువారు దేవుని రాజ్యమును చేరలేరు. “శరీర కార్యములు స్పష్టమై యున్నవి; అవేవనగా జారత్వము, అపవిత్రత, కాము కత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదము లు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. (గలతి 5:20,21)” .

        కాబట్టి దేవుని రాజ్యములోనికి ప్రవేశించటానికి ఇన్ని షరతులు ఉంటే మరి ఆ దేవుని రాజ్యము యొక్క గొప్పతనమును, మహిమను ఒక్కసారి అర్ధం చేసుకొండి. “తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.(1 థెస్స 2:11)” .

        కనుక సువార్తను నమ్మి దేవుని రాజ్యము అందుబాటులో ఉన్నప్పుడే స్పందించవలెను. ◌