దేవుని వాక్యాన్ని ఎందుకు బోధించాలి?

10/04/2011 19:34

 

          దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ఎందుకు బోధించాడు?  క్రైస్తువులంటేనే సభలు, ప్రసంగాలు, బోధనలు, ప్రార్థనలు అన్నట్లుగా ఉంటారు. ఈ రోజున క్రైస్తవులకు ఎందుకు ఎక్కడ చూసిన దేవుని వాక్యన్ని బోధించడం జరుగుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తు తన 3½  సేవాకాలంలో ఎక్కువగా బోధించాడు మరియు ప్రసంగించాడు. కొండ మీద, పడవలో, పండుగలలో, ఎక్కడపడితే అక్కడ ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు. అసలు యేసుక్రీస్తు వాక్యాన్ని ఎందుకు బోధించాల్సివచ్చింది?  

అర్థం చేసుకోవాలి

          గమనించండి. మనం చెయ్యాల్సిన పనులను ముందుగానే మన మనస్సులో ఆలోచించుకొని ఆ తరువాత వాటిని చేస్తాం. ఆయా విషయాలు మనకు అర్థం అయిన దానిని బట్టి మన జీవితాలు ఉంటాయి. అంటే మన understanding  పైన మొత్తం ఆధారపడిఉంది. కనుక ఆయన దేవుని వాక్య సత్యాలు అందరికి పూర్తిగా అర్థమవడానికి బోధించినాడు. ఎందుకంటే మానవులకు అవి బోధపడాలని మరియు మనస్పూర్తిగా అర్ధం చేసుకొని పాటించాలని. అలాగే క్రైస్తవ బోధకులు కూడా యేసుక్రీస్తు బోధనలను ప్రసంగాల ద్వారా వివరిస్తూవుంటారు. అందుకే యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించాల్సివచ్చింది. మానవులకు ఏ ఏ విషయాలైతే తెలియదో ఆ విషయము వారికే తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వాక్యమును వారికి వివరించినాడు.

ఉదాహరణకు,

1. ప్రయాసపడి సమస్త భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని బోధించాడు. ఇక్కడ విశ్రాంతి అంటే ఏమిటో గ్రహించాలి?

2. హృదయశుద్ధికలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఇక్కడ హృదయశుద్ధి అంటే ఏమిటో తెలియాలి? మరియు అది ఏలా కలుగుతుందో కూడా వివరించాలి.

3. ఎవరైతే మార్పునొంది చిన్నబిడ్డలవలే అవుతారో వారు దేవుని రాజ్యమును చేరతారు. ఇక్కడ చిన్న బిడ్డలవలే అవడం అంటే ఏమిటి?

4. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఇక్కడ  క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి?

            So, పై విషయాలు కొంచం గమనిస్తే మనిషికి ఎంత understanding మిస్ అవుతుందో మీరే గ్రహించగలరు. బేసిగ్గా పై విషయాలపై వివరణ లేదా బోధ అవసరం అన్న విషయం మనకు అర్థమౌతుంది.

            మానవులకు ఆలోచించే విధానం తెలియాదు. యేసుక్రీస్తు తెలియజేయనిదే మానవులకు ఆలోచించే విధానం రాదు. కొన్ని విషయాలలో ఐతే అయితే అస్సలు తెలియదు. కనుక మానవులకు ఎ విషయాలైతే తెలియదో అవే మానవులకు తెలియజెప్పాడు.

జ్ఞానం ఏది?

          మనకు జ్ఞానం అనేది ఎక్కడ నుండి వస్తుంది? మన చిన్ననాటి నుండి పంచేద్రియాల ద్వారా ఆలోచించడం ద్వారా మనకు జ్ఞానం సంక్రమిస్తుంది. అంటే చూడటం, వినటం, రుచిచూడడం, తాకడం, వాసనచూడడం వంటి వాటి ద్వారా ఈ లోక జ్ఞానం వస్తుంది. వీటి ద్వారా కాకుండా మనకు వేరే విధంగా జ్ఞానం వచ్చే అవకాశం లేదు. యేసుక్రీస్తు గనుక ఈ లోకానికి రాకుండా మనకు జ్ఞానం బోధ చేయకపోతే ఖచ్చితంగా మానవులకు జ్ఞానం వచ్చేదికాదు. మరియు మనము మన పాపాల్లోనే బ్రతికి పాపంతోనే మరణించే వారిమి. అప్పుడాయన - మీరు క్రిందివారు, నేను పైనుండువాడను, మీరు లోకసంబంధులు, నేను లోకసంబంధుడను కాను. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించినయెడల మీరు మీ పాపములలోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.(యోహాను 8:23,24).  

బోధించడం అవసరం

          కాబట్టి మానవులకు జీవితం మీద సరైన understanding  కావాలంటే దేవుని యొక్క బోధ చాలా అవసరం. మన జీవితం గురించిన ప్రశ్నలకు యేసుక్రీస్తు తన బోధనలలో వివరించాడు.

1. ఓ మనిషి నువ్వెవరు? ఎందుకు ఈ భూమి మీద జన్మించావో చెప్పాడు. 2. మనిషికి పెళ్లెందుకో చెప్పాడు. 3. మనిషికి కుటుంబమెందుకో చెప్పాడు. 4. మనిషి పాపి ఎందుకయ్యాడో చెప్పాడు. 5. మరణించిన తరువాత మనిషి ఎక్కడికి వెళతాడో చెప్పాడు. 5. ఈ భూమి మీద ఎందుకింత దుష్టమున్నదో చెప్పాడు. 6. మనిషి ఆనంద జీవితం ఎలా జీవించాలో చెప్పాడు. 7. మరియు మనిషి పరిశుద్దజీవితం ఎందుకు జీవించాలో తెలియజేసాడు. ఇవన్ని ప్రస్తుతం దేవుని వాక్యం ద్వారా మాత్రమే బోధింపబడుతున్నాయి.

          దేవుని వాక్యం యొక్క గొప్పతనమేమిటంటే మానవుల యొక్క భవిష్యత్తు అందులో వ్రాయబడిఉంది. ముందుగా చెప్పడిన భవిష్యత్తు నెరవేరిందని కూడా వ్రాయబడింది. ఎలా అంటే యేసుక్రీస్తు యొక్క జననం మరియు మరణం గూర్చి ముందుగా వ్రాయబడింది. మరియు అది నెరవేరిన తరువాత ఆయా విషయాలు కూడా పూర్తిగా పొందుపరచబడియున్నాయి. ఇలాంటివి దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. దేవుడు తన పరిశుద్ధ సేవకుల చేత ఈ వాక్యమును వ్రాయించినాడు. అది ఇప్పుడు బైబిల్ రూపంలో మనయొద్దకు వచ్చినది.

జీవ వాక్యము

ఈ వాక్యమును గమనించండి. - సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి వాడును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.(1 పేతురు 1:24). ఈ వాక్యభాగం పాతనిబంధనలో వ్రాయబడింది. పేతురు దీనిని కొత్తనిబంధనలో ఎత్తి వ్రాసాడు. ఈ వచనాన్ని గమనించినట్లయితే మానవులందరు గడ్డిని పోలినవారు. గడ్డికి నీరు అందినంత వరకు చక్కగా పచ్చగా ఉండి బ్రతుకుతుంది. ఎప్పుడైతే నీరు అందకుండా పోతుందో అప్పుడు అది ఎండి పోతుంది. చచ్చిపోతుంది. అంటే దాని స్థితి ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండదు. మానవుల యొక్క జీవితం కూడా అంతే. వారు కొంతకాలం అందంతో జీవంతో పచ్చగా ఉంటారు. ఆ తరువాత వారు రాలిపోతారు. గత 6 వేల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ ఇదేగా!. ఉదాహరణకు మా తాతయ్య ఇప్పుడు ఇక్కడలేడు. మా తాతయ్య తండ్రి కూడ లేడు. ఆయన కూడా నాకులాగానే పుట్టాడు. చక్కగా పెరిగాడు. పెళ్లిఅయింది తరువార పిల్లలు తరువాత ముసలివడై మరణించాడు. ఇది అందరికి జరిగే ప్రక్రియే. చాలా సింపుల్ గా తీసుకొంటున్నాం. 18 సంవత్సరాలనుండు 30 వరకు యవ్వనదశ అని అనుకొంటే, ప్రస్తుతం ఉన్న యూత్ గా ఉన్నవారు చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. కాని మనకంటే ముందు పుట్టిన ప్రతిఒక్కరు ఆ వయస్సులోనుండే వెళ్లారు అని గ్రహించేవారు ఎంతమంది?

అందుకే యేసుక్రీస్తు బోధించాడు. సర్వశరీరులు నిరంతరం నిలువరు గాని దేవుని జీవ వాక్యం నిలుస్తుంది. అది మరణం లేనిది. ఈ జీవ వాక్యమే సువార్తలాగా మనకు బోధింపబడింది. కనుక background knowledge లేకుండా ప్రస్తుత మానవ స్థితి అర్థంకాదు. యేసుక్రీస్తు బోధించిన సువార్త ఏమిటి? మనలను ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన మన మంచికే పిలుస్తున్నాడు.

          మానవుడు reject చేస్తున్నాడు కాని ఆయన మనలను భౌతికంగా ఆత్మసంబంధముగా ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడు. నిత్యజీవము ఇవ్వడానికే పిలుస్తున్నాడు. ఈ మాటలన్ని యేసయ్య బోధలో ఉన్నాయి కాని ఏవరికి అర్థం కావడం లేదు.

తిండి గూడు గుడ్డ

          మనుష్యులు కేవలం తిండికోసం బట్టకోసం గృహం కోసమే బ్రతుకుతున్నట్లు కనబడుతున్నది. కాని అవి శాశ్వతం కావు. కాని అవి ఎవరికైతే ఉండవో వారు వాటి ఎలా సంపాదించడం కోసమే జీవిస్తారు. ఈ లోకంలో మానవ జీవితం శారీరక విషయాల చుట్టు తిరుగుతుంది. అన్నం లేని అన్నం ఎలా సంపాదించాలా అని వెతుకుతున్నాడు. అలాగే ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కొరకు, డబ్బులేని వాడు డబ్బు కొరకు, కొంతమంది శరీర సుఖాల కొరకు, కొంతమంది  పేరుప్రతిష్టల కొరకు ఇలా ఈలోకసంబందమైన సమస్యలతో మరియు కోరికలతో వారి జీవితం గడిచిపోతుంది. ఎవరి సమస్య వారికి వారిని ఎవరు ఏం అనలేరు. కాని ఇక్కడే అసలు సమస్య ఉంది. మానవుడు అది ఏమిటంటే వాడంతట వాడు ఈ సమస్యలను తొలగించుకోలేదు. అంతే కాకుండా ఇవన్ని ఇప్పటికిప్పుడు ఎర్పడిన సమస్యలు కావు. మానవ జాతి ఆరంభమునుండే ఇవి వస్తూ ఉన్నాయి. అందుకే మానవ చరిత్రలోకి దేవుని కుమారుడు వచ్చి మానవుల నిస్సహాయతను మరియు సమస్యలనుండి విడుదలను వివిధ రకాలుగా బోధించినాడు.

          కాబట్టి, .మానవులందరు ముందుగా ఎలా ఆలోచించాలి (how to think) అనే విషయాన్ని తెలుసుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు మనలో మారుమనస్సు కలుగజేసినప్పుడు మనకు నూతన పరిశుద్ధ స్వభావం వస్తుంది. అప్పుడు ఈ లోకంలోని  ఎలాంటి సమస్య అయిన దానిని ఎలా ఆలోచించాలి? మరియు ఏ కోణం నుండి ఆలోచించాలో ఖచ్చితంగా తెలుస్తుంది.        

మన ఇష్టం

          యేసుక్రీస్తు ఇన్ని బోధలు చేసినా గాని ఎన్నడు ఎవరిని నమ్మమని బ్రతిమాలలేదు. అవి నమ్మాలా వద్దా అనే నిర్ణయాన్ని మనకే వదిలేశాడు. లేకపోతే మన జీవితాలు ఈ భూసంబంధమైన సమస్యలలో ఉండి, ఈ భూసంబంధమైన ఆలోచనలకే పరిమితమైపోతాయి. అలా మన జీవితాలు అంతమైపోతాయి. ఈ రీతిగా ఈలోకాధికారి అయిన సాతాను అందరిని మభ్యపెడుతున్నాడు. అందరు వారి జీవితంలో దేవునికి చోటియ్యవలెను. దేవుని వాక్యమును సమయం తీసుకొని చదువవలెను. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నిజమైన దేవుని పరిశుద్దులను గుర్తించి వారి బోధించు వాక్యము వినవలెను. మానవ చరిత్రలోనే దేవునివాక్యాన్ని బోధించడం అనేది అంత్యత ఉన్నతమైన పని. 

          దేవుని పరిశుద్దులు శ్రద్ధకలిగి వాక్యన్ని బోధించడం చాలా అవసరం. వారు దేవునికి లెక్క అప్పగించవలసిన వారైయున్నారు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.(యాకోబు 3;1).