నిజమైన స్వాతంత్ర్యం : True Freedom

03/03/2010 10:51

              ప్రపంచంలో అందరు ఫ్రీడమ్ ని కోరుకొంటారు. కాని ఎవ్వరు నియమాలు, హద్దులు, ఆజ్ఞలు కోరుకోరు. నిజానికి ఆజ్ఞలు లేనిదే ఫ్రీడముండదు. అసలు ఫ్రీడమ్(స్వేచ్ఛా స్వాతంత్ర్యం) అంటే ఏమిటో మీకు తెలుసా? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

          మీకు తెలుసా ఈ రోజున చాలామంది స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటున్నారు. కాని అది బానిసత్వము. చాలామంది నిజమైన స్వాతంత్ర్యం విషయంలో మోసపోతున్నారు. ప్రజాసామ్య ప్రభుత్వమ వలన మనకు స్వాతంత్ర్యము వచ్చిందని అనుకుంటే పొరపాటుపడ్డట్టే. అసలు నిజమైన ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలియకుండా దానిని ఎవరు అనుభవించలేరు. అలానే బానిసత్వము అంటే ఏమిటో తెలియకుండా దానినుండి ఎవరు బయటపడలేరు.

        పేతురు ఇలా అన్నాడు. తామే (ఈ లోకస్తులు) భ్రష్టత్వమునకు దాసులై యుండియు, అట్టివారికి స్వాతంత్య్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా? (2 పేతురు 2:19)”. ఏదైతే మనలను జయిస్తుందో దానికి మనం దాసులమవుతాము. ఉదాహరణకు మధ్యపానం, సిగరె ట్లు త్రాగడం. నాకు స్వేచ్చ ఉంది నన్నడిగే వాడే లేడు కనుక ఎంతైనా త్రాగుతాను అని త్రాగుతాపోతే ఏం జరుగుతుంది? ఏ రోజునయైతే అది నీకు దొరకదో అప్పుడు తెలుస్తుంది నీవు ఎంత స్వేచ్ఛగా ఉన్నావో లేదా బానిస బ్రతుకు బతుకుతున్నావోఎందుకంటే దానికోసం తపిస్తూ ఏదైన చేయటానికి సిద్దపడతావు. ఫలితం నాశనం. త్రాగుడొక్కటే కాదు ప్రతి చెడ్డ అలవాటుది ఇదేతంతు. నీ చుట్టూ గమనిస్తే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

        సాతాను ఈ లోకాధికారి. ఈ లోకమంతా ప్రస్తుతం సాతాను బానిసత్వము క్రింద ఉన్నది. సాతాను ఈ లోకమునకు తండ్రి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. (యోహాను 8:44)”. కనుక ఈ భూప్రపంచం మొత్తం బానిసత్వములో ఉంది. అంతేకాకుండా సాతాను వలన సర్వసృష్టి కూడా బానిసత్వములో ఉంది. విడుదల కోసం పరితపిస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది.  ఏలయనగా సృష్టి నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని(సాతాను) మూలముగా లోపరచబడెను. (రోమా 8:19-21)”. దేవుని కుమారుడు వచ్చి మనకు ఈ విషయాన్ని(సత్యాన్ని) చాలా Clear గా చెప్పి విడుదల మార్గాన్ని చూపించాడు. ఈ సత్యము మనకు నిజమైన స్వాతం త్ర్యం ఇస్తుంది. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును (యోహాను 8:32)”. ఎప్పుడైతే దేవుని సువార్తను విని పశ్చాత్తాపపడి మారుమన స్సు పొంది బాప్తిస్మము పొందుతామో మనకు పరిశుద్దాత్మ శక్తి ఇయ్యబడుతుంది. పరిశుద్దాత్మశక్తి వలన ఈ లోక బానిసత్వములో నుండి బయటకు పిలువబడి నిజమైన ఫ్రీడమ్ పొందుతాము. “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. (యోహాను 8:36)”.

            ఈ స్వాతంత్ర్యము ఈలోక స్వాతంత్ర్యము వంటిది కాదు. కనుక చేసేది ఏదైనాసరే మనము దానికి బానిసలు కాకూడదు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నింటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను. (1 కొరింథీ 6:12)”.  దేవునికి లోబడి ఆజ్ఞలలో జీవించుటమే నిజమైన స్వాతంత్ర్యము.

        తప్పులు చేయగలిగియుండి కూడా చేయకుండా ఉండగలిగే శక్తి సామర్ధ్యం మనకు వస్తాయి. ఇదే నిజమైన స్వాతంత్ర్యము.