2వ పరిశుద్ధదినం —పులియని రొట్టెల పండుగ

12/03/2010 21:47

 

 

14 రాత్రి

 

14 పగలు

15 రాత్రి

15 పగలు

16, 17, 18, 19, 20 రోజులు

21 రాత్రి

21 పగలు

పస్కా అచరించు సమయం (సూర్యాస్తమయం తరువాత)

 

పులియని రొట్టెలపండుగ

ప్రారంభం

 

 

పులియని రొట్టెలపండుగ

చివరిరోజు

పులియని రొట్టెలపండుగ సమాప్తం

 

 

 

       

 ఇది వారం రోజుల పండుగ. పస్కా వెంటనే ఈ పండుగ వస్తుంది కాబట్టి దీనిని పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ అంటారు. “పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను.” (లూకా 22:1). ఈ పండుగ లో కేవలం పులియని రొట్టెలను మాత్రమే భుజింపవలెను. మన ఉత్తర భారతదేశంలోవలె ఆనాడు ఇశ్రాయేలీయులకు కూడా గోదుమ రోట్టెలే వారి ముఖ్య ఆహారం. మనం అన్నం తిన్నట్లు వారు రొట్టెలను తింటారు. కనుక దేవుడు వారిని ఈ పులియని రొట్టెలను తిని పండుగను ఆచరించమన్నాడు. పురుగులు పట్టిన లేదా బూజు పట్టిన లేదా పులిసిన పిండితో రొట్టెలను తినకూడదు. మనం మన ముఖ్య ఆహారమైన వరిన్నం కూడా అలాగే భుజించవలెను.

        పులిసిన పిండి పాపమునకు సాదృస్యము. దానిని తీసివేసి భుజించుటమనేది మన జీవితాలలో పాపాన్ని తీసివేసి జీవించుటంతో సమానం. పాపాన్ని క్రమంగా తీసేసుకొంటు పరిశుద్దతవైపు మనం కొనసా గాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది క్రమక్రమంగా జరిగే ప్రక్రియ. “పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనై నను దుర్మార్గతయు దుష్టత్వ మునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్య మును సత్యమునను పులియనిరొట్టెతో పండుగ ఆచరింతము.”(1 కొరింథీ 5:6-8). ఈ విధంగా పౌలు కొరింథీ సంఘానికి పులియని రొట్టెల పండుగ ఆచరించాలని బోధించినాడు. మరియు పౌలు ఫిలిప్పి నగరంలో పులియని రొట్టెల పండుగ ఆచరించినాడు. “పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పయి విడిచి అయిదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితిమి.” (అ.కా 20:6).

        ఈ పండుగను ఏ రోజులలో పాటించవలెను? పస్కా పండుగ అయిన మరుసటి రోజునుండి వారం రోజులు ఆచరించవలెను. పండుగలో మొదటి రోజు  మరియు చివరి రోజు జీవనోపాధికి ఏ పని చేయకూడ దు. ఈ రెండు రోజులు దేవుని సన్నిదిని అందరు పరిశుద్ద సంఘముగా కూడవలెను. “ఆ నెల పదునయి దవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. ”( లేవి 23:6-8).