ఇవి అంత్యదినాలేనా?

08/03/2010 17:18

               మనమెంత భయంకరమైన పరిస్ధితులలో జీవిస్తున్నామో ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే మనకు అర్ధమౌతుంది. మంచికి, నీతికి, న్యా యానికి రోజులు కావు. ఎవరైనా మంచిగా ఉండాలన్నా కూడా ఊరుకోదు ఈ లోకం. వారిని పాడుచేసి చెడుమార్గంలోకి తీసుకువచ్చేస్తుంది. కుళ్లు, అసూయ, రాజకీ యం, స్వార్ధం మొదలైనవి మనిషిని ఏలుతున్నాయి. మంచివారిని చూసి వీరేంటి కొంచం తేడాగా ఉన్నారు అని నవ్వుకొనే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఏదైనా మంచి మిగిలిందంటే అందులో కూడా ఎంతో కొంత స్వార్ధం ఉంటూనే ఉంది.

            ప్రపంచంలో ఎక్కడ చూసిన టెర్రరిసమ్, ఆత్మా హుతి దాడులు, భయంకరమైన రోగాలు, కరువులు, సునామీలు, తుఫానులు, హరికేనులు, యుద్ధాలు, విచ్చలవిడితనం, లంచగొండితనం, స్వార్ధ రాజకీయాలు, ఘోరమైన నేరాలు, వ్యభిచారం మొదలైన భయంకరమైన పాపాలతో నిండిపోయింది. పాపం దాని తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ (కంప్యూటర్స్, ఇంటర్నెట్, మోబైల్స్, టివి చానల్స్) బాగా అభివృద్ధి చెందినది. కాని అంతకంటే ఎక్కువగా అందులో పాపం అభివృద్ధి ఎక్కవైనది.

            ఈ రోజున అన్నీ మలినమైపోయాయి. ప్రేమ, స్నేహం, జాలి, కరుణ, దయ, సంతోషం, కుటుంబ జీవితం అన్నీకల్తి అయిపోయాయి. దేనికి దాని సహజస్థితి లేదు. చివరకు దేవుని సువార్త, సేవ కూడా కల్తి అయిపోయాయి. అసలు వారేం బోధిస్తున్నారో, ఎందుకు బోధకులౌ తున్నారో వారికే అర్ధం కావడం లేదు. వాళ్లు చెప్పేది ఇదే.--“దేవుని నమ్ముకొండి మీ జీవితాల్లో ఏ కొదువ ఉండదు.”  ఇదే వారి సేవ.

             పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్తే తమ పొరుగువారిని చూసి ఎప్పుడు ఏడుస్తున్నారు. వారి స్వార్ధం కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరు. చిన్నపిల్లల దగ్గరనుండి ఎవరినైనా చంపడానికి వెనుకాడరు. ఈ మద్యే ఒక సేవకుడిని తన సొంత కుమా రుడే(23 సంవత్సరాల వయస్సు) హత్యచేసాడు. మహా భయంకరం. మరి ఆయన ఏం సేవ చేశాడు? కొడుకుని ఏ రీతిగా పెంచాడు? దేవుని నామానికే అవమానం. ఇలాంటి భయంకమైన పరిస్థితులలో ఈనాటి పిల్లలు పెరుగుతున్నారు. ప్రపంచములో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటు న్నారు. జీవితమంటే విరక్తిచెంది ఇంక ఏ నిరీక్షణ(Hope) లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

            ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మానవుడు వారి వారి రాజ్యాలను ఏర్పరచుకొని పరిపాలిస్తు వస్తున్నాడు. మానవులు తమనుతాము పరిపాలించుకోవటానికి రకరకాల ప్రభుత్వాలను ట్రై చేసి చివరకి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాడు. మరియు రకరకాల మతాలు, దేవుళ్లు, నమ్మకాలు రకరకాలుగా మనిషిని అయోమయంలో పడవేస్తున్నాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని గందరగోళంలో ఉన్నాడు.

               మరోవైపు ఒక్క జీవికూడా మిగులకుండా ఈ ప్రపంచానంతటిని సమూలంగా అంతమొందించే జీవరసాయన అణు మారణాయుధాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. మానవుడు అంతగా అభివృద్ధి చెందాడు. కనీసం అవి 50 సార్లు ఈ భూమినంతటిని నాశనం చేయగలవు. ఈ ప్రపంచానికి ఏమైనా నిరీక్షణ (Hope) ఉందా?

             మనమెందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చాము? కేవలం చివరి 100 సంవత్సరాలలో ఇలాంటి పరి స్థితుల్లోకి వచ్చాము. ఎందుకంటే ఇవి అంత్యదినాలు. ఇంతకముందు కంటే మనం ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడకు మరీ దగ్గరగా వచ్చేసాం.     

            ఈనాడు లెస్బియన్స్(స్త్రీలతో స్త్రీలు పెళ్లిచేసు కున్నవారు ), గేస్(Gays పురుషులతో పురుషులు పెళ్లి చేసుకున్నవారు) భయంకరంగా ఉన్నారు. వారి హక్కుల కోసం ప్రాణాలు పోయెంతగా ప్రాకుచున్నారు. ఆనాడు నొవహు దినములలో మరియు లోతు దినములలో భయంకరమైన విచ్చలవిడి పాపం ఉండినది. దేవునికి విధేయులైన జనులు లేనే లేరు. అంత్యదినాలలో కూడా అలానే జరుగుతుందని యేసు ప్రవచించినాడు. “నొవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోకి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచునుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమునుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనముచేసెను. ఆ ప్రకారమే మనుష్యుకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” (లూకా 17:26-30) .

            ఇంతకి నొవహు దినములలో ఏం జరిగింది? నరుల యొక్క చెడుతనము చూచి భూమిమీద నరులను సృజించినందుకు దేవుడే చాలా బాధపడినాడు. “నరుల చెడుతనము భూమిమీద గొప్పదని యు, వారి హృదయము యొక్క తలంపులలోని  ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.” (ఆ.కా 6:5,6). “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరి పివేసుకొని యుండిరి.”(ఆ.కా 6:11-12).

            ఈ రోజున ఆనాడు జరిగిన దానికంటే కూడా ఎన్నోరెట్లు ఎక్కువగా పాపం జరుగుతుంది. దేవుడు మనలను చాలా చాలా భయంకరంగా శిక్షించనున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని అలాంటి శ్రమ ఎన్నడు కలుగలేదు. యేసయ్య గనుక రాకపోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనలేడు. “అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలి కాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింప కుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటివరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయి నయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును”(మత్తయి 24:20-22).

            ఆ మహాశ్రమల వైపు మానవులు పరుగెతున్నారు. వెళ్లేకొంది ఇంకా పరిస్థితులు మరీ అద్వానంగా తయారవుతాయి. కాని కేవలం దేవుని నిజమైన బిడ్డలకు ఆ శ్రమల నుండి రక్షణ ఉంది. కనుక కాలము నెరిగి నిద్రమేల్కొని సమయం ఉండగానే దేవుని చెంత చేరవలెనని ప్రభువు పేరట మీకు ప్రకటిస్తున్నాను.