ఇవి అంత్యదినాలేనా?

01/07/2012 11:46

ఇవి అంత్యదినాలేనా?

                రాత్రి చాలా గడచి తెల్లవారుటకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది, ఈ లోకం పరిస్థితి. దేవుని రెండవ రాకడ గుర్తులు మన కళ్లముందే జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన స్వార్ధం కనబడు తుంది. డబ్బు మరియు వ్యాపారం అనే ధోరణితోనే ఈ ప్రపంచం నడుస్తున్నది. క్షణం క్షణం ఏ జరుగుతుందో అంతు తెలియకున్నది. మానవ జీవితాలు క్షణాల్లో కళ్లముందే గాలిలో కలిసిపో తున్నాయి. అనురాగం, ఆప్యాయత మరియు ప్రేమ మొదలైనవి అన్ని కలుషితమైపోయాయి. 20 యేళ్లక్రితం ఉన్న మానవ దృష్టికోణం ఇప్పుడు లేదు. అంతా తలక్రిందులైపోయాయి. సమీకరణాలు క్షణాల్లో మారుతున్నాయి. ఎ సంభంధం ఎప్పుడు తెగిపోతుందో, ఎ సంభంధం ఎప్పుడు ఏర్పడు తుందో తెలియని విచిత్ర కాలంలో మనం జీవిస్తున్నాము. సంపూర్తిగా అనిశ్చితి నెలకొనియుంది.

ప్రస్థుతం అన్ని కొనబడును మరియు అన్ని అమ్మబడును. మానవులు ఏదైనా కొనటానికి లేదా అమ్మటానికి సిద్ధం. తన మన బేధం లేదు. మానవుల తుచ్చమైన కోరికలకు వావివరుసలే లేవు. నియమ నిబంధనలు చాలా ఉన్నాయి కాని పాటించేవారే అసలే లేరు. ఎవరు ఎంత ఎక్కువగా మోసం చేస్తే వారు అంత తెలివిగలవారుగా ప్రస్తుతం ఎంచబడు తున్నారు. అనేకమంది దేవుని పేరునే వారి స్వార్థ వ్యపారాలకు వాడుకుంటున్నారు. అడ్డు అదుపులేని లోకాన్ని మన చూస్తున్నాం. ఇవే అంత్యదినాలు.

                ఎవరికి భయం లేదు. భక్తి లేదు. దేవుని పైన విశ్వాసం తెలియదు. తన పబ్బం గడుపు కోవటానికి దేనికైన తెగించటానికి సిద్ధపడుతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి. కొత్త కొత్త రోగాలు కూడా వచ్చాయి. విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. ఎంటర్ టైన్మంట్(వినోదం) అనే మాయలో పడేసి మానవులను వెర్రివాళ్లను చేస్తున్నారు. కొందరి జీవితాలే నాశమైపోతున్నాయి. మానవునికి ఒక ఫ్యుచర్(నిరీక్షణ) లేదు. ఒక గతి గమ్యం లేదు. అందుకే ఈ రోజున ప్రతి సెకనుకి ఒకరు ఆత్మహత్య చేసుకొంటున్నారు.

ఇలా ఎందుకు ప్రపంచం ఎందుకు మారిపోయింది అంటే ఇవి అంత్యదినాలు. కేవలం దేవుని యొక్క ఉగ్రత రుచిచూడటం కోసమే ఈ తరము ఇలా తయారైంది. ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు. దేవుని ఉగ్రతనుండి కేవలం నిజ దేవుని సంఘ విశ్వాసులు మాత్రమే తప్పించ బడతారు. వారు దేవుని పరిశుద్ధులు.  చెవులుగలవాడు వినును గాక!  ◌