ఈ పత్రిక ఎందుకు?

18/02/2010 23:04

       సభ్యసమాజం తలదించుకొనేలా క్రైస్తవులనేవారే ప్రవర్తిస్తూ వస్తుంటే మన పొరుగు వారు చూచి క్రైస్తవ్యం అంటే ఇదేనా అని అవమాన పరిచేంత అవకాశం కల్పించేవారికి, తద్వారా దేవు ని నామానికి అవమానం తెచ్చేవారికి నిజక్రైస్తవ దేవునిసంఘం అంటే ఏమిటో తెలియజెప్పె దేవుని సంఘం ఉండాలని మరి ఈ విషయంలో దేవుని ప్రేరణతో దేవుని సంఘ సభ్యుడిగా దేవుని సంఘ మును ప్రారంభించి పత్రికసేవ చేయుటకు పూను కొన్నాను. దేవుడు తన నిజమైన కుమారులను ఎన్నడు విడువడు ఎడబాయడు. ఇలా తన వారికోసం తన పనిని జరిపిస్తుంటాడు.దేవుని కొరకైన Responsibilityతో నేను ఫీలయ్యి దేవుని వాక్య సత్యాలను నిర్మొహమాటంగా దేవుని సాక్ష్యా ర్ధమై ఉండుటకు ప్రచురించ పూనుకొన్నాను. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యము. సమస్త జ్ఞానములకు మూలం దేవుని వాక్యమే.

        ప్రస్తుతం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అంధకార స్థితిలో ఈ ప్రపంచం ఉంది. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  సమయం ఉండగానే అన్నింటిని చక్కదిద్దుకోవాలి. ప్రస్తుతం మనిషి ఏది చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో మరియు దేనికోసం ప్రాకులాడుచు న్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఈవిధంగా ప్రపంచం మొత్తం చాలా అంధకారంలో ఉంది. చీకటి అంటే బొత్తిగా కటిక చీకటిలో ఉందన్నమాట! కేవ లం దేవుని వాక్యం చేతనే ఈ చీకటి తొలగించబడుతుంది. కొంచం గమనించండి! ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మరియు జీవి వెనుక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉపయోగం లేనిదే ఈ సృష్టిలో ఏదియు ఉండదు. దీనినే Law of Cause and Effect అని అంటారు. కారణం లేకుండా ఈ సృష్టిలో ఏది సృజింపబడలేదు. అలాగే నీ జీవితానికి ఒక కారణం, అర్దం, ఉపయోగం ఖచ్చితంగా ఉన్నాయి. కొంచం ఆలోచించి దేవుని వాక్యంలో చూస్తే క్రమ క్రమంగా నీకే అర్దమౌతుంది. ఈలాంటి లోతైన విషయాలను ఈ మా పత్రికలో చర్చిస్తాం! ప్రస్తుతం భయంకరంగా ఉన్న ప్రపంచ స్థితికి కారణాలు మరియు దానికి దారితీసిన పరిస్థితులు దేవుని ప్రవచన వాక్యపు వెలుగులో ప్రచురిస్తాం. ప్రస్తుత నిజక్రైస్తవులు ఎవరు? వారి తక్షణ భవిష్యత్తు ఏమిటి? అన్న విషయాలను దేవుని వాక్యపు వెలుగులో ప్రచురిస్తాం.

           దేవుడు సృజించిన ఈ సృష్టిలో మానవుడే మణిహారం (Master Piece). ఒక అద్బుత సృష్టి. అసలు విషయం ఏమిటంటే మనం ఆయన పోలిక ఆయన జాతి. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే మనలను ఆయన అత్యధికంగా ప్రేమి స్తున్నాడు. మనిషి ఎప్పుడు ఎలా బ్రతకాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండాలనే దేవుడూ కోరుకొంటున్నా డు. కాని దేవుడు మానవ జాతిని చూసి బాధ పడుతున్నాడు. “నీతిమంతుడు లేడు ఒక్కడు ను లేడు గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. అందరును త్రోవత ప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచే యువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి; తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి దృష్టియెదుట దేవుని భయము లేదు (రోమా 3:11-18)”.   

           దేవుడు ఏదిచేసిన మనిషి యొక్క ఆనందం కోసమే. దేవుని వాక్యం ఏం చెపుతుం దంటే మనిషి యొక్క ఆనందమయ జీవితానికి కేవలం దేవుని ఆజ్ఞలు, నియమాలు మరియు కట్టడలే మూలం. రాబోవు సంచికలలో వీటి గురించి క్షుణ్ణంగా వివరిస్తాం. ఏ ఉత్పత్తిదారుడైన ఒక వస్తువు తయారుచేసిన తరువాత దాని features మరియు దానిని ఎలా ఉపయోగించాలో తెలిపే ఒక instructions book ఖచ్చితంగా ఇస్తారు. ఈవిధంగా మాన వుల కొరకిచ్చినదే దేవుని వాక్యం ( the Bible). దేవుని వాక్యంలో లేని బోధలను (అబద్ధ బోధన లు) అవి ఏమైనా సరే ఖండిస్తు, దేవుని వాక్యం మానవులకు ఏమైతే చేయమని, చెప్పమని బోధిస్తుందో అవి మాత్రమే ఈ మా పత్రికలో ప్రచురిస్తాం.

            దేవుని పద్దతిలో(Gods way of Life) జీవితమును జీవించుటకు ఆసక్తిగల వారు దేవునివాక్యాన్ని అర్ధం చేసుకొని సరైన ఆలోచనా ధృక్పధం కలిగియుండాలి. అలాంటివారి జీవితాల మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్దికి ఈ మా పత్రిక ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఆవిధంగా ఆశీర్వదించబడతారు. ◌