ఒంటరి

18/02/2010 23:38

             ప్రపంచంలో ప్రతిఒక్కరు తనని అందరు ఇష్టపడాలని తనతో అందరి ఉండాలని కోరుకుంటారు. అందుకే మనం ఫ్రెండ్స్ తోనూ మన కుటుంబంతోను ఖచ్చితంగా అప్పుడప్పుడు సమయం ఇయ్యాలి. కాని ఎన్నో కారణాల వలన ఈ విధంగా అందరూ ఉండలేక పోతున్నాము. తల్లిదండ్రులు ఇద్దరూ ఉధ్యోగాలు చేయటం, లేదా వారిమధ్య సఖ్యత లేకపోవడం, లేదా ఎవరి లోకంలో వారుండటం లేదా చిన్నప్పుడే తల్లి/తండ్రి చనిపోవటం వలన చాలామంది వారి చిన్ననాటి నుండి సరిగ్గా పెరగక ఒంటరితనానికి బలిఅవుతారు. ప్రతి మనిషి తన మొదటి 25 సంవత్సరాల లో Experience అయిన జీవితం తరువాత జీవితం మీద ప్రభావం చూపుతుంది. ప్రవర్తన, మాటలు, వేష దారణ మొ||వి అన్ని ప్రభావితం అవుతాయి.

            ఒకోసారి అందరు ఉన్నా ఎంతో ఒంటరితనం తో భాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి సంఘజీవి అన్నాడు అరిస్టాటిల్. మన సృష్టికర్త కూడా ఆదామును సృజించి ఇలా అన్నాడు. "మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను (ఆ.కా 2:18)". ఎప్పుడైనా ఆలోచించారా మనం ఒంటరిగా ఎందుకుండకూడదో? ప్రతి మనిషికి ఎంతో కొంత  Privacy అనేది ఉండాలి. కాని చాలా కాలం ఒంటరిగా ఉంటే మనలో ఒక లాంటి స్వార్ధ స్వభావం తయారవుతుంది. అదే ఎప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించడం(Selfish). ఒంటరితనం ఎప్పుడు తన గురించే చూసుకోవడం, ఆలోచించడం వంటి Negative Thinking లోకి తీసుకెళ్తుంది. వివాహం అయినా ఈ రోగం పోదు. ఒంటరితనం మనలను చాలా కృంగదీస్తుం ది. అనేకమంది ఆత్మహత్యలకు మరియు క్రమినల్స్ గా అవటానికి ఇదే కారణం. సత్యం ఏమిటంటే ఇతరుల సహాయం లేనిదే మనం ఒంటరిగా ఏ పని చేయలేం. ఎవరో ఒకరి సహా యం కొంతైనా అవసరమౌతుంది. కనీసం మన సన్నిహి తుల యొక్క Support మరియు Encouragement అయినా ఉండాలి. మనందరం ఎపుడోకప్పుడు ఎంతో కొంత ఒంటరితనంతో భాధపడుతూనే ఉంటాం. ఒంటరితనానికి కారణాలు తెలుసుకొని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి.

 ఒంటరితనానికి కారణాలు

            ఒంటరితనం చాలా వరకు చిన్ననాటి నుండే ఉంటుంది. కాని వారు కనబడరు. అందరితోను ఉంటారు ఒంటరితనంతో భాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, ఏదైనా అంగవైకల్యం ఉండటం, త్వరగా విషయాలను అర్ధం చేసుకోలేకపోవడం, నలుగురిలో మాట్లాడలేకపోవడం, జీవితంలో అనుకోని సంఘటనలు జరగటం, ప్రాణం కన్నామిన్నగా ప్రేమించినవారు చనిపోవడం లేదా దూరమవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు.  ఎవరికైతే ప్రేమగల సృష్టికర్తతో సంబంధం ఉండదో వారిని ఒంటరితనం వేధిస్తునే ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేవునితో సంబంధం ఏర్పడుతుందో ఒంటరితనం క్రమ క్రమంగా మటుమాయమౌతుంది.

దేవునితో సంబంధం

             దేవునితో సంబంధం ఏర్పడిన నాటి నుండి మనకు ప్రేమ, సంతోషం, సమాదానం, స్నేహం, నలుగురతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సంస్కారం, నైతిక విలువలు మన స్వభావంలోకి క్రమంగా వస్తాయి. గమనించండి. నీ సృష్టికర్తతో సంబంధం ఏర్పడాలి. (ప్రాముఖ్యమైన విషయం). రోజు దేవునితో సంబంధం కలిగియుండటం వలన అందరిని ఆకర్షించే వ్యక్తిత్వం గలవారమౌతాము. మన గురించి మాత్రమే ఆలోచించకుండా ఇతరుల గురించి కూడా అలోచించగలగాలి. మన ఆలోచనలు ఇతరుల మీద రుద్దకూడదు. కొత్త స్నేహాలు, సంబంధాలు సరైనవారితో ఏర్పరచుకొంటు ఉండాలి. ఎక్కువశాతం మాట్లాడుట కంటే వినుటకు ఇష్టపడాలి. సాధ్యమైతే ఎంతో కొంత సహాయం చేయాలి. ఈ విధంగా చేయడం వలన మనలో కొంత Emotional Maturity వస్తుంది. అంటే ఏది ఎక్కడ ఎప్పుడు ఎవరితో చెప్పాలో లేదా చెయ్యాలో తెలిసి వస్తుంది. తద్వారా మన మీద మనకు Control వస్తుంది. ఒంటరితనంగా ఆలోచించడం పూర్తిగా పోతుంది.

దేవుడు మిమ్మను మంచి మిత్రులతో ఆశీర్వదించును గాక. ◌