క్రిస్మస్ రహస్యం

18/02/2010 22:59

ప్రపంచంలో ఎక్కువమంది ఆచరించు పండు గ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనా అని అర్ధం. డిసెం బర్ 25న క్రీస్తు పుట్టినరోజుగా క్రిస్మస్ ఆచరిస్తా రు. మొట్టమొదటి సారిగా క్రిస్మస్ అను మాట క్రీ.శ. 1038లో ప్రాచీన ఇంగ్లీషులో కనుగొనబడింది. అయితే యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించాడా? సర్వశక్తిమంతుడైన దేవుడు క్రిస్మస్ అను పండుగను ఆచరించమని ఆజ్ఞాపించినాడా? మరి దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

        సత్యం ఏమిటంటే మొట్టమొదటి క్రైస్తవులు(యేసు క్రీస్తు యొక్క శిష్యులు) పుట్టినరోజు పండుగ లను పాటించలేదు. అలాగే యేసు క్రీస్తు జన్మదిన పండుగను కూడా ఆచరించలేదు. క్రైస్తవశాస్త్రం క్రీ.శ. 185-232 ప్రకారం "పాపాత్ములు మాత్రమే జన్మదినా న్ని పండుగలాగా ఆచరించినట్లు దేవునివాక్యంలో ఉంది". క్రీస్తు జన్మించినప్పుడు కొందరు గొర్రెల కాపరు లు రాత్రివేళ పొలములో తమ మందను కాచుకొనుచు న్నట్లు( లూకా 2:8) దేవుని వాక్యం చెపుతుంది. ఇశ్రాయేల్ దేశంలో అక్టోబర్ నెల నుండి బాగా చలి మరియ వర్షాకాలం. చలికాలంలో అక్కడ బాగా వర్షాలు కురుస్తా యి. అక్టోబర్ నెల వరకు గొర్రెల కాపరులు తమ మందలను పొలములలో కొండలలో మేపేవారు. కనుక క్రీస్తు డిసెంబర్ 25న జన్మించడానికి వీలులేదు. మరియు క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడని దేవుని వాక్యంలో ఎక్కడ వ్రాయబడలేదు. అయితే మరి క్రీస్తు పుట్టుకకు డిసెంబర్ 25కు ఉన్న సంబంధం ఏమిటి?

క్రైస్తవ మతము

             చరిత్ర ప్రకారం క్రీస్తు మరణించిన తరువాత 300 సంవత్సరాల వరకు క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్యలో ఉండి చాలా శ్రమలకు హింసలకు గురిఅయి నారు. అనేక ప్రభుత్వాల చేత హింసింపబడినారు. అయితే క్రీ.శ. 313 లో "కాన్ స్టాన్ టైన్" అనే రోమా చక్ర వర్తి క్రైస్తవ మతమును అంగీకరించిట వలన క్రైస్తవుల పరిస్థితి మారిపోయింది. ఈ చక్రవర్తి కాలం నుండి క్రైస్తవ్యము పెద్ద ఎత్తున పాశ్యత్య దేశాలలోకి పాకిపో యింది. స్థిరపడి పోయింది. "కాన్ స్టాన్ టైన్" కు ముందు వందల సం|రాల క్రితం నుండి రోమా సామ్రాజ్యము వారి మత పండుగలు ఆచరించేవారు. వారి మతంలో (బబులోను మతం) డిసెంబర్ 17-23 వరకు సాటర్నలియా(SATURNALIA) అనే పండుగను ఆచరించేవారు. ఈ పండుగలో ఒకరికొకరు కానుకలు(గిఫ్టులు) ఇచ్చుకొని సంతోషించేవారు. తరువాత డిసెంబర్ 25న మిత్రా(MITHRA) అనే పేరుగల దేవుని జన్మదిన పండుగ ను ఆచరించేవారు. మిత్రా అంతే నీతిమంతుడైన సూర్య భగవానుడు అని వారి అర్ధం. అంతేకాకుండా రోమియుల నూతన సంవత్సరం పండుగ (జనువరి 1) ఆచరించేవారు. ఆ దినమున గృహాలు దీపాలతో అలంకరించుకొని గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొనేవారు(Encyclopedia Brtanica).ఇప్పటికి ఆచరింస్తున్నది ఈ పండుగే.

             రోమా సామ్రాజ్యము క్రైస్తవ్యమును అంగీకరించక మునుపు రోమామతం(బబులోను మర్మపు మతం) ఈ పండుగలను ఆచరించేవారు. ఈ పండగలు క్రైస్తవ్యములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలుగా మార్చబడినాయి. ఈవిధంగా సూర్య భగవానుడు లేదా మిత్రా అను రోమా మత దేవుని జన్మదినం, డిసెంబర్ 25న క్రీస్తు ఆరాధనకు అంటే క్రిస్మస్ గా మార్చబడినది. ముందుగా తెలిపినట్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకొనె సాంప్రదాయం క్రీస్తు కంటే ముందుగానే ఉన్నది. అయితే తూర్పుదేశపు జ్ఞానులు రాజును దర్శించడానికి వచ్చారు కనుక కానుకలు తెచ్చారు. అయితే ఇది ఇచ్చిపుచ్చుకొనె సందర్బం కాదు. కేవలం సమర్పించారు కాని పుచ్చుకొనలేదు. మరి శాంతక్లస్ లేదా St. నికోలస్ లేదా క్రిస్మస్ తాత మాటేమిటి? క్రిస్మస్ తాత రోమా మతంలో ఉన్న నిమ్రోదు అనే వ్యక్తి. ఇతని గురించి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నయి. "నికోలాయితుల బోధను క్రీస్తు ద్వేషించాడు"( ప్రకటన 2:15 ). ఆ బోధ క్రిస్మస్ తాతకు సంభందించిన బోధ.

        క్రిస్మస్ పండుగను ఆచరించువారు ఎన్నో రకరకాల కారణాలు చెపుతారు. " మేము డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినాన్ని గుర్తుచేసుకొని ఆరాధిస్తన్నాం" అని కొందరంటే " క్రీస్తు సువార్త ప్రకటించటానికి ఈ రోజును ఉపయోగిస్తున్నాం. మేము కేవలం క్రీస్తు జన్మదినాన్ని గౌరవిస్తున్నాం" మరికొందరు సాకులు చెపుతారు.

అబద్దబోధ

             యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 25న జన్మించ లేదు. అసలు ఏ రోజున జన్మించాడో దేవుని వాక్యంలో లేదు. చరిత్రలో కూదా లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. యేసు క్రీస్తు తన జన్మదినమును పండుగ లాగా ఆచరించమని ఆజ్ఞాపించనూ లేదు. యేసు క్రీస్తు మొదటి శిష్యులు ఆచరించినట్లు దేవుని వాక్యంలో లేదు. క్రీస్తు తన మరణ దినాన్ని జ్ఞాపకం(1 కొరింథీ 11:24-27) చేసుకోమన్నాడు (ఇదీ ఈస్టర్ పండుగ కాదు) కాని జన్మదినాన్ని కాదు.

        క్రైస్తవులు యేసు క్రీస్తు నియమించిన మరియు ఆచరించమనిన ఆజ్ఞలు, పండుగలు విస్మరించి దేవుడు ఆజ్ఞాపిచనటువంటి వాటిని చేయుచున్నారు. "మనుష్యలు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్దముగా ఆరాధించు చున్నారు (మత్తయి 15:9)". మరియు యేసు ఇలా చెప్పె ను "ప్రభువా ప్రభువా అని నన్నుపిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందు న్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును (మత్తయు 7: 21)". కాబట్టి సత్యమును గ్రహించి నిజ దేవుని వైపు తిరిగి సత్యముతో దేవుని ఆరాధించవలెను. ◌