తిరిగి జన్మించుట : Born Again

20/02/2010 09:59

             నీకొదేమను ధర్మశాస్త్ర ఉపదేశకుడొకడు రాత్రి వేళ యేసుక్రీస్తు నొద్దకు వచ్చెను. అప్పుడు యేసు “ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడు” అని చెప్పెను. అందుకు నీకొదేము “ముస లివాడు ఏలాగు మరలా తల్లి గర్బములోకి వెళ్ళి మళ్ళి జన్మించగలడు” అని అడిగెను. అందుకు యేసు “ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు.” అని చెప్పెను. అందుకు నీకొదేము ఈ సంగతులు ఏలాగు సాధ్యమని యేసుక్రీస్తును అడిగెను. అందుకు యేసు “నీవు ఇశ్రాయేలు భోధకుడవైయుండి వీటిని ఎరుగవా? భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు?” అని ప్రశ్నించెను. “అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడ లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నెను........... నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా? భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పి నయెడల ఏలాగు నమ్ముదురు? (యోహాను 3:4-12)” .

            ఆనాడు నీకొదేముకు అర్ధం కాలేదు. ఈనాడు కూడా ఎవరికి అర్ధమైనట్లులేదు. మళ్ళి చెపుతున్నాను-దేవుని పరిశుద్దాత్మ ద్వారా మాత్రమే మనకు దేవుని సంగతులు అర్ధంమౌతాయి. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి;  అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. (1 కోరింథి 2:14)”. ఇంతకి తిరిగిజన్మించుట లేదా క్రొత్తగా జన్మించుట అంటే ఏమిటి?

             మొదటిగా నీటి మూలముగా జన్మించవలెను. అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. దేవుని నిజ సువార్త విని, విశ్వసించి, పశ్చాత్తాప పడి, మారుమనస్సు పొంది, బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈవిధంగా ముందు నీటిమూలముగా జన్మించవలెను. ఆ తరువాత ఆత్మ మూలముగా జన్మిస్తాము. అంటే నీవు యేసుక్రీస్తునందు పరిశుద్ధ జీవితమును కొనసాగించి మారుమనస్సుకు తగిన ఫలములు( గలతి 5:22) ఫలించినప్పుడు యేసుక్రీస్తు తన రెండవ రాకడలో ఆత్మసంబంధిగా జన్మిస్తావు. “మృతుల పునరుత్థానమును ఆలాగే (శరీరము) క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేప బడును; బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధ శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబం ధ శరీరమున్నది గనుక ఆత్మసంబంధ శరీరముకూడ ఉన్నది. (1 కోరింథి 15:42-44)”. దేవుని కుటుంబములో ఆత్మజీవిగా జన్మిస్తావు. గమనించండి. శరీర మూలముగా జన్మించేది శరీర జీవులు ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మజీవులు. “శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. (యోహాను 3:6)” .

             యేసుక్రీస్తు నీకొదేముతో చెప్పినట్లు మనమ ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తామో direct గా దేవుని రాజ్యములో ఉంటాము. అయితే ప్రస్తుతం ఎంతమంది దేవుని రాజ్యములో ఉన్నారు. అంటే ఎంతమంది ఇప్పటివరకు తిరిగి జన్మించారు? అంటే ఎంతమంది ఆత్మ మూలముగా జన్మించారు? ఒకే ఒక్కడు. ఆయనే యేసుక్రీస్తు. “ప్రతివాడును తన తన

వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. (1 కోరింథి 15:23)” . ఆయన శరీరముతో మరణించి ఆత్మ మూలముగా లేచి (మనకు రుజువు చూపించి) ఆరోహనుడై తండ్రి యొద్దకు వెళ్ళెను. మనము కూడా యేసుక్రీస్తు వలె పరిశుద్ధ జీవితమును జీవిస్తే ఆత్మ సంబంధముగా జన్మించగలము.

 

మరి నీవు నీటి మూలముగా జన్మించినావా? ◌