దేవుని పరిశుద్ధ దినాలు - దేవుని పండుగలు

11/03/2010 09:30

 

             మనం పాటించే పండుగలకు అర్ధం ఏమైనా ఉందా? ఏ రోజుపడితే ఆ రోజు పాటిస్తే ఏమైనా సమస్య ఉందా? మనం పాటించుట కొరకు ఏమైనా పండుగలు దేవుని వాక్యంలో తెలియపరిచాడా? బైబిల్లోని పండుగ లు ఎవరెవరు పాటించాలి? యూదులా? లేదా క్రైస్తవు లా? లేదా యూదా క్రైస్తవులా (యేసు క్రీస్తు మరియు ఆయన 12 మంది శిష్యులు) ? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

            క్రైస్తవులు క్రిస్మస్, గుడ్ ప్రైడే, ఈస్టర్, లెంట్ దినాలు మరియు న్యుఇయర్ ఇంకా అనేక రకాల పండుగలు ఆచరిస్తారు. ఆశ్యర్యం ఏమిటంటే వీటిగురించి దేవుని వాక్యంలో ప్రసక్తే లేదు. ఎవరైనా ఆచరించినట్లు దేవుని వాక్యంలో లేదు. మరెందుకు ఆచరిస్తున్నారు? అంటే ఎక్కడో తేడా జరిగిందన్నమాట!

            మరి క్రైస్తవులు ఆచరించవలసిన పండుగ లేమైనా దేవుని వాక్యంలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే మన మొదటి క్రైస్తవులు ఆచరించినట్లు దేవుని వాక్యంలో ఉందా? దేవుని వాక్యంలో ఏడు దేవుని పండుగలున్నాయి. వాటిని మన మొదటి క్రైస్తవులు పాటించారు. ప్రతి పండుగకు ఆత్మ సంబంధమైన కారణాలు మరియు అర్ధాలు ఉన్నాయి. దేవుని పండుగలు మానవ జీవితాలపట్ల దేవుని యొక్క మహత్తర ప్రణాళికను తెలియజేస్తున్నాయి. వాటిని గ్రహించి పాటించడం వలన దేవుని గొప్ప విమోచన ప్రణాళికను మన జీవితాలలో అన్వయించుకోగలము.

        దేవుడు తన స్వజనులకు పాటించవలసిన పరిశుద్దదినాలు ఇచ్చెను. వాటిని విశ్రాంతి దినములంటారు. ప్రతివారం 7వ రోజును విశ్రాంతిదినముగా(సబ్బాతుదినం) ఆచరింపవలెను. అంతేకాకుండా మరొక 7 పండుగలనిచ్చెను. ఒకవేళ పండుగ సబ్బాతుదినము రోజునే వస్తే దానిని మహాదినము అంటారు. దేవునివాక్యం ప్రకారం సూర్యాస్తమయం నుండి మరల సూర్యాస్తమయం వరకు ఒక దినమౌతుంది. “అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.”(ఆ.కా 1:5).

నిజమైన ఇశ్రాయేలీయులు ఎవరు?

         చాలామంది దేవుని వాక్యములోని పండుగలను యూదుల పండుగలని అంటారు. కాని మన మొదటి క్రైస్తవులందరు యూదులే. యేసుక్రీస్తు కూడా యూదుడే. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును మహి మయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చ నాచారాదులును వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడైయుండి నిరంతరం స్తోత్రర్హుడైయు న్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరు ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాముచేత అందరును పిల్లలు కారు.”(రోమా 9:4-7). ఈ వచనాన్ని గమనించారా? దేవునియందు విశ్వాసముంచిన వారే నిజమైన యూదులు లేదా ఇశ్రాయేలీయులు. అంతేకాని అబ్రహాము సంతానమైనంత మాత్రాముచేత ఇశ్రాయేలీయులు కారు.

        దేవుని పండుగలు కేవలం నిజమైన ఇశ్రాయేలియులకే లేదా నిజమైన యూదులకే నియమించబడినవి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరు నిజముగా అబ్రహాము సంతానము. “ఇందులో యూదుడని గ్రీసుదేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,  పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తు నందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబందులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. ”(గలతి 3:28,29). దేవుని వాగ్దానము చేత అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు వలే యేసుక్రీస్తు నందు ఉన్న మనమందరం అబ్రహాముయొక్క కుమారులం. “సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమైయున్నాము.”(గలతి 4:28).

        

దేవుని వాక్యములో ఉన్న పరిశుద్ద దినాలు మరియు పండుగలు

1. పస్కా పండుగ

2. పులియని రొట్టెల పండుగ

3. పెంతెకోస్తు పండుగ

4. బూరధ్వని పండుగ

5. ప్రాయశిత్తార్ధ దినము

6. గుడారాల పండుగ

7. చివరి మహాదిన పండుగ

 

ఇవి తప్ప వేరే పండుగలు దేవుని వాక్యములో లేనే లేవు. చాలామంది ఇవి యూదుల పండుగలని అంటారు. కాని మన మొదటి క్రైస్తవులందరు యూదులే. యేసుక్రీస్తు కూడా యూదుడే. యేసుక్రీస్తు స్వయంగా ఈ పండుగలన్ని పాటించాడు. కాని పాతనిబంధనలో ఉన్న బలులన్ని యేసుక్రీస్తు యొక్క బలితో ఆగిపోయాయి. అంతేకాకుండా మన నుండి ఆత్మసంబంధమైన బలులను(విధేయత) మాత్రమే కోరుతున్నాడు. ఈ పండుగలన్ని దేవుడు ఆయన స్వజనులకు మాత్రమే ఇచ్చాడు. అన్యజనులకు కాదు. ఈ పండుగలన్ని ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం.

 

క్లుప్తంగా

             ఈ పండుగలు మానవులపట్ల దేవునికున్న ప్రణాళికను తెలియస్తున్నాయి. దేవుడు చెప్పిన తేధీలలోనే ఈ పండుగలను ఆచరించవలెను.

 1.  పస్కా పాపక్షమాపణ నిమిత్తము చేసిన యేసుక్రీస్తు యొక్క బలిని సూచిస్తుంది. దేవుని క్యాలెండర్ మొదటి నెలలో 14వ తారీఖున సాయంకాలమున పస్కా పండుగ ఆచరించవలెను

 2. పులియని రొట్టెల పండుగ మనము మారుమన స్సు పొందిన తరువాత పాపం అనే పులిపిండిని క్రమక్రమంగా మన జీవితంలో నుండి తీసివేయడాన్ని సూచి స్తుంది. పస్కా పండుగ అయిన మరుసటి రోజునుండి వారం రోజులు ఆచరించవలెను.

 3. పెంతెకొస్తు దేవుని మొదటి పునరుద్ధానములో పాలుపొందే మారుమనస్సు పొందిన సంఘమును మరియు ప్రధమఫలముల పరిశుద్దులను సూచిస్తుంది. పులి యని రొట్టెల పండుగలో చివరి సబ్బాతుదినం నుండి 7 వారాలు లెక్కించి, 50వ రోజున పండుగ ఆచరించవలెను.

 4. బూరధ్వని పండుగ మహిమగల యేసుక్రీస్తు రెండ వ రాకడను సూచిస్తుంది. దేవుని క్యాలెండర్ 7 వ నెల మొదటి తేధీన ఈ పండుగ ఆచరించవలెను.

 5. ప్రాయశ్చిత్తార్ధ దినము యేసుక్రీస్తు యొక్క బలి యాగమును తద్వారా యేసుక్రీస్తు రెండవ రాకడ తరు వాత మానవులు దేవునితో పొందే ఐక్యతను (నిత్యజీవాన్ని) సూచిస్తుంది. దేవుని క్యాలెండర్ 7 నెలలో 10వ తారీఖున ఈ పండుగను ఆచరించవలెను. 

 6. గుడారాల పండుగ మహిమగల యేసుక్రీస్తు వెయ్యేండ్ల రాజ్య పరిపాలనను సూచిస్తుంది. దేవుని క్యాలెండర్ 7వ నెల 15వ తారీఖునండి వారం రోజులు దీనిని ఆచరించవలెను.

 7. చివరి మహాదిన పండుగ మానవులందరికి జరుగ బోవు యేసుక్రీస్తు మహా తీర్పును సూచిస్తుంది. గుడారా ల పండుగ మరుసటి దినమున ఈ పండుగను ఆచరించవలెను. 

   
  దేవుని పరిశుద్ధ దినాలు రోమా క్యాలెండర్ ప్రకారం క్రింది ఇచ్చిన తేధీలలో ఆచరించవలెను.


Roman Year

పస్కా పండుగ

పులియని రొట్టెల పండుగ

పెంతెకొస్తు

పండుగ

బూరధ్వని

పండుగ

ప్రాయశ్చిత్తార్ధ

దినము

గుడారాల

పండుగ

చివరి మహా దినపండుగ

2010

మార్చి 29

మార్చి 30-ఏప్రిల్ 5

మే 23

సెప్టెంబర్ 9

సెప్టెంబర్ 18

సెప్టెంబర్ 23-29

సెప్టెంబర్ 30

2011

ఏప్రిల్ 18

ఏప్రిల్ 19-25

జూన్ 12

సెప్టెంబర్ 29

అక్టోబర్ 8

అక్టోబర్ 13-19

అక్టోబర్

20

2012

ఏప్రిల్ 6

ఏప్రిల్ 7-13

మే 27

సెప్టెంబర్ 17

సెప్టెంబర్ 26

అక్టోబర్

1-7

అక్టోబర్

8

2013

మార్చి 25

మార్చి 26-ఏప్రిల్ 1

మే 19

సెప్టెంబర్ 5

సెప్టెంబర్ 14

సెప్టెంబర్ 19-25

సెప్టెంబర్ 26