నాయకుడు

03/04/2011 14:37

నాయకులు కారణజన్ములు. వారి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. కనుక ఎవరుపడితే వారు నాయకలు కాలేరు.

          నలుగురు మనుష్యులను వెంటేసుకొని తిరిగినంతమాత్రానా లేదా డబ్బు ఉన్నంత మాత్రానా నాయకులవరు. నాయకత్వం ఒక పెద్ద బాధ్యత. ఈ లోక పరమైన నాయకత్వం అసలైన నాయకత్వం కాదు. కేవలం దేవుని చేత ఎర్పరచబడిన నాయకడే నిజమైన నాయకుడు. ఉదాహరణకు మోషేకున్న భౌతికమైన లక్షణాలను చూచి ఐగుప్తు దేశానికి నాయకుడౌతాడని అందరు భావించారు. కాని ఇశ్రాయేలీలకు నాయకత్వం వహించే విధంగా దేవుడతనిని తయారు చేశాడు. ఈ రోజున ఎవరుపడితే వారిని నాయకుడంటున్నారు. అది నిజం కాదు.

ఈ లోకనాయకత్వం

        ప్రస్తుత మన ప్రపంచ అభివృద్ధికి గాని లేదా నాశనానికి గాని మన దేశనాయకులే కారణం. దేశాలు అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలన్నా లేగా నాశనానిక చెందాలన్నా ఆ దేశనాయకులు తీసుకొనే నిర్ణయాలపై ఖచ్చితాంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం దేశాలలో ఉన్న నాయకులు  ఆలోచనలు చిన్నపిల్లలవలే ఉన్నాయి. మరియు వారు తీసుకొనే నిర్ణయాలు పిల్లలు ఆడుకొనే ఆటలవలే ఉన్నాయి. మరియు వారి తీసుకొనే నిర్ణయాల వలన దేశప్రజల మధ్య భయంకరమైన వ్యత్యాసాలు వస్తున్నాయి. వారి నిర్ణయాలవలన కేవలం కొంతమంది మాత్రమే లబ్దిపొందడమే వలన ప్రజలయొక్క జీవన విధానాలలో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. ఈనాడు ప్రజలు దొంగలుగాను, తాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, నరహంతకులుగాను తయారవడానికి కారణం మనకు క్రమశిక్షణ కలిగిన నిజమైన నాయకులు లేకపోవడమే. లంచగొండితనం కలిగిన ఎవరును నాయకుడు కానేరడు. ఈనాడు మన నాయకులను చూస్తుంటే మన దేశ దౌర్భాగ్య స్థితి మనకు అర్ధమౌతుంది. ఈనాటి చిన్నపిల్లలే రేపటి దేశ పౌరులన్నట్లు, మనదేశ ఈనాటి నాయకుల యొక్క బాల్యం ఏవిధంగా గడిచియుంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

          ఎప్పుడైతే తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగి వారి జీవితాలను కోనసాగిస్తారో అప్పుడు వారి కుటుంబాలు బాగుంటాయి. ఎప్పుడైతే కుటుంబాలు బాగుంటాయో అప్పుడు మంచి పౌరులు తయారవుతారు. అప్పుడు వారు మంచి నాయకులౌతానికి అవకాశం ఉంటుంది. కనుక ఈనాటి ఈలోక పరిస్థితికి కారణం తల్లిదండ్రులే. కనుక తల్లిదండ్రలు వారు వివాహం ఎందుకు చేసుకొన్నారో మరియు పిల్లలను ఎందుకు కన్నారో ఒకసారి ప్రశ్నించుకొని, ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఈ లోకంలో మనం నిజమైన నాయకులను చూడలేం.

నిజమైన నాయకత్వం

          ఎవరైతే తన కుటుంబాన్ని సరిగ్గా ఏలగలుగుతారో వారు మాత్రమే నిజమైన నాయకులౌవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే తన స్వంత కుటుంబాన్ని సరిగా పరిపాలించ లేనివారు ఏలాగు నిజమైన నాయకులు కాగలరు. ప్రేమ, జాలి, దయ, నిష్పక్షపాతము, అధితి ప్రియుడు, విధ్యావంతుడు, దానగుణము మరియు దేవునియందు భయభక్తులు గలవారే నిజమైన నాయకులౌతారు. నాయకులకు శరీర, మానసిక బలహీనతలుండకూడదు. వీరికి శరీర, మానసిక బలహీనతల గూర్చిన పూర్తి అవగాహన మరియు వాటిని తట్టుకొనే మనోథైర్యం(గుండె నిబ్బరం) కలిగియుండాలి. ఇవే నిజమైన నాయకుని లక్షణాలు. ఈనాడు నిజమైన నాయకులు లేని కొరత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవడైనను అధ్యక్షత నాశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిధిప్రియుడును, బోధింపతగిన వాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును, జగడమాడని డును, ధనాపేక్షలేనివాడునై, అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిధిప్రియుడును, బోధింపతగిన వాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగ ఏలువాడునైయుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరకపోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి(కలిగిన) శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాదిఉరిలో పడిపోకుండునట్లు(సంఘమునకు) వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను. ఆలాగుననే పరిచారకులు మాన్యులైయుండి, ద్విమనస్కులునుమిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము నపేక్షించువారునైయుండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.”(1తిమోతి 3:1-10).

ఆత్మసంభందమైన నాయకత్వం

        దేవుని వాక్యంలో అనేకమంది గొప్ప నాయకులున్నారు. వీరందరు దేవుని ఆత్మచేత నడిపింపబడినారు. కనుక ఎవరైతే ఆత్మసంబంధమైన నాయకులను వెంబడిస్తారో వారి భౌతిక జీవితమే కాకుండా ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా బాగా కొనసాగుతుంది. అయితే అలాంటి దైవ సంబంధమైన నాయకుడిని గుర్తించగలగాలి. ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి వాక్యనుసారమైన జీవితాన్ని జీవిస్తూ అందరికి మాదిరికరముగా ఉంటారో, అలాంటి వారిని గుర్తించి వారిని వెంబడింపవలెను.

          అపోస్తులుడైన పౌలు తన శిష్యులతో ఇలా అన్నాడు. నేను దేవుని పోలి నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొండి”. కనుక ఎవరైతే ఆత్మసంబంధమైన నాయకులను వెంబడిస్తారో వారు జీవముగల దేవుని వెంబడించినట్లే.  మన గొప్ప కాపరియైన మరియు నిజమైన నాయకుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన వారికోసం అతి త్వరలో రానైయున్నాడు.  వచ్చి తన నిజమైన శిష్యులందరిని ఆత్మసంబంధమైన నిజమైన నాయకులుగా చేస్తాడు.