పరలోకమందున్న మా తండ్రి

10/04/2011 19:33

            చాలా మందికి దేవుని యొక్క ఉనికి తెలియదు. దేవుడు ఒక్కడే అని అంటారు. బైబిల్లో ఉన్న యోహోవా, పరిశుద్దాత్మ, పరలోకమందున్న తండ్రి, దేవుని కుమారుడు ఇలా దైవత్వము కలిగిన వారందరు యేసుక్రీస్తు అని అంటారు. కొంతమంది త్రియేక దేవుడంటారు. అంటే పాతనిబంధన మరియు క్రొత్తనిబంధనలో ఉన్నది ఒకే ఒక దేవుడు ఆయనే యేసుక్రీస్తు అని అంటారు. ఎవరో ఏదో అన్నారని కాదు కాని దేవుని వాక్యం ఏమి చెపుతుందో ఎప్పుడైన ఆలోచించారా?

ఆదియందు

అన్నింటికంటే ముందు ఎవరు ఉన్నారు? భూమ్యాకాశములను సృజింపకముందు, దేవదూతలను సృజింపకముందు మరియు అసలేనియు సృష్టింపకముందు ఎవరున్నారు? అలాంటి వాక్యం బైబిల్లో ఉందా? ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (1యోహాను 1:1). ఈ వచనాన్ని గమనించండి. ఇంతకంటే ముందు స్థితి తెలిపే వాక్యం బైబిల్లో లేదు. ఇందులో మీకు ఎంతమంది జీవులు కనబడుతున్నారు? కేవలం ఇద్దరు. ఒకరు దేవుడు మరిఒకరు వాక్యము. కాని ఇద్దరు దేవునివలె ఉన్నారు. అప్పటికి ఇంకా ఏదియు సృజింపబడలేదు. వాక్యము ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. (1యోహాను 1:2,3). ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు. తరువాత ఈయనచేత సమస్తము(దేవదూతలు, భూమ్యాకాశములు) సృజింపబడనవి. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.(ఆ.కా 1;1) . పాతనిబంధనలో ఉన్న యోహోవా ఎవరు? వాక్యము అనబడిన ఈ దేవుడే. మరి యేసుక్రీస్తు ఎవరు? వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; (1యోహాను 1:14). కనుక ఆదియందు ఉన్న ఇద్దరి దైవాలలో ఉన్న వాక్యము యేసుక్రీస్తు వలె మన మద్య నివసించాడు. కనుక ఈ వాక్యమే పాతనిబంధనలో యోహోవా దేవుని వలే అందరితో మాట్లాడినాడు. కాని అప్పుడు ఎవరును ఆయనను చూచియుండలేదు. కాని క్రొత్తనిబంధనలో ఆ వాక్యము మానవుని వలే శరీరధారియే మన అందరి మధ్య నివసించినాడు. మరి ఈ పరలోకమందున్న తండ్రి ఎవరు?

తండ్రియైన దేవుడు

          పైన గమనించిన రీతిగా వాక్యము అనే దైవము దేవుని యొద్ద యుండెను. వాక్యము ఆదియందు దేవునియొద్ద ఉండెను. (1యోహాను 1:2). వాక్యమనే ఈ దేవుడు పాతనిబంధనలోను మరియు క్రొత్తనిబంధనలోను మానవులకు పరిచయమైన వ్యక్తి. యే దేవుని యొద్ద అయితే ఈ వాక్యమనే దేవుడుండెనో ఆయన ఎవరికి తెలియదు. కేవలం మద్య నివసించిన యేసుక్రీస్తు ఆ దేవుని తన తండ్రిగా మానవులకు పరిచయం చేశాడు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.(1యోహాను 1:18). ఇంతవరకు ఆ తండ్రియైన దేవుని ఎవరు చూచియుండలేదు. కేవలం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే తెలుసు. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు. (1యోహాను 6:46). యేసుక్రీస్తు తన తండ్రియైన దేవుడు తనకు బోధించిన అన్ని విషయాలను ఆయన ప్రజలందరికి ప్రకటించినాడు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను.(యోహాను 8:38).  పరలోకమందున తండ్రి యేసును ప్రేమించిన ప్రకారం ఆయన మనందరికొరకు తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించెను. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని; నా ప్రేమయందు నిలిచియండుడి.(యోహాను 15:9). పరలోకందున్న తండ్రి మరియు కుమారుడైన క్రీస్తు ఏకమైయున్నలాగున, క్రీస్తునందు విశ్వాసముంచిన వారు కూడా క్రీస్తుతో ఏకమైయున్నారు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమై యుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్ధించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమై యుండవలెనని వారికొరకును ప్రార్ధించుచున్నాను. (యోహాను 17:20,21). 

            ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుకు మాత్రమే తండ్రికాదు ఆయన మానవులందరికి అందరికి తండ్రి. అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి - నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను.(యోహాను 20:17). యేసుక్రీస్తు శిష్యులు తమకు ప్రార్థించుట నేర్పమని అడిగినప్పుడు ప్రార్థన పరలోకమందున్న తండ్రియైన దేవునికి ప్రార్థించమన్నాడు. క్రైస్తవులందరు తండ్రియైన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తారు. కేవలం మన పరలోకమందున్న మన తండ్రి బట్టి అసలు కుటుంబమనేది ఏర్పడినది. హేతువుచేత పరలోకము నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో తండ్రియెదుట నేను మోకాళ్లూని (ఎఫెసి 3:14).

దేవుని శక్తి

          కుమారుడైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణుడైనప్పుడు తండ్రియైన దేవుడు తన కుమారుని నామమున విశ్వాసులందరికి ఆదరణగా ఉండుటకు పరిశుద్ధాత్మ అను ఒక ఆదరణ కర్తను పంపినాడు. అయితే అది విశ్వాసులందరికి దేవుడనుగ్రహించు శక్తి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు.(అ.కా 2:33).

            కాబట్టి దేవుడు ఒక్కడే. అయనే మన పరలోకమందున్న దేవుడు. దేవుని వాక్యము ఒక్కడే. ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు. ఇంక వేరే దేవుడు తెలియపరచబడినట్లుగా దేవుని వాక్యములో లేదు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.(1 తిమోతి 2:5).

కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు:

1. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రివలన పుట్టినవికావు; అవి లోకసంబంధమైనవే.(1 యోహాను 2:16).

2. యేసు చెప్పెను : నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. (ప్రకటన 3:21).

3. యేసుక్రీస్తుదాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి (శుభమని చెప్పి) వ్రాయునది. (యూదా 1:1).

4. సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.(2 యోహాను 1:3).

5. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.(1 యోహాను 2:23).

6. యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. (1 యోహాను 2:22).

7. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.(యాకోబు 1:27).

8. శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, జోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఛాయయైనను లేదు. (యాకోబు 1:17).

9. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు (తండ్రి)కి అభీష్టమాయెను.(కొలస్సి 1:19).

10. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై