పశ్చాత్తాపము : Repentance toward God

20/02/2010 09:29

              “చేసిన తప్పును గుర్తించి చేసినందుకు నిజంగా బాధపడి క్షమాపణ కొరకు అర్ధించే మనస్సాక్షిని కలిగియుండటాన్ని” పశ్చాత్తాపము అంటారు. ఎప్పుడైతే మనము నిజమైన దేవుని సువా ర్తను విని దానిని నిజంగా గ్రహిస్తామో అప్పుడు దైవ సంబంధమైన పశ్చాత్తాపము కలుగుతుంది. దేవుని సువార్త మనలను దేవుని కుమారులుగాను, దేవుని రాజ్య నివాసులుగాను చేస్తుంది. అలా మన భవిష్యత్తు ఉండాలంటే మనం ఈ లోక సంబంధమైన జీవితం విడచి పరిశుద్ద జీవితమును కోరుకోవాలి. ఈనాటి వరకు మనం జీవించిన జీవితము ను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మనం ఎన్ని తప్పులు, దోషాలు, పాపాలు, భౌతికంగాను, మానసికంగాను చేసినమో గుర్తించగలగాలి.

           చిన్ననాటి నుండి మన జీవిత విధానం ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రము(పది ఆజ్ఞలు) నను సరించి లేదని మనకు బోధపడుతుంది. దేవుని ఆజ్ఞ లను వ్యతిరేఖిస్తూ అతిక్రమిస్తూ మన జీవితం కొన సాగిఉండవచ్చు. అయితే దేవుడు మనలను తన సువార్త ప్రకటన ద్వారా తన కుమారులుగా చేయాల నుకుంటున్నాడు. కనుక మన ప్రస్తుత పాప జీవితా నికి జీవిత విధానానికి దేవుని ఎదుట పశ్చాత్తాప పడవలసియున్నది.

         ఒక్కవిషయం గమనించండి! దేవుని విషయాలు మనకు అర్ధం కావాలంటే దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించవలసి ఉంది. ఎందుకంటే ప్రకృతి సంభంధియైన మనము దేవుని సంగతులు గ్రహించలేము. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి; అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. (1 కొరింథీ 2:14)”. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపం చెందుతారో వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహి స్తాడు. “దేవుడు తనకు విధేయులైనవారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, (అ.కా 5:32)”. మనం నిజంగా పశ్చాత్తాపము చెందినప్పుడు మనం చేసిన పాపాలు దేవుడు ఎలా తొలగిస్తాడు?

            కాలం సంపూర్ణమైనప్పుడు తగిన సమయంలో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి సువార్తను ప్రకటింపజేసి మన దోషాలు మరియు పాపాల నిమిత్తము తన కుమారున్ని బలి ఇచ్చినాడు. కుమారుని నీతిమంతమైన జీవితము మన అందరి పాపాల నుండి మనలను విడుదల అనుగ్రహించగలిగింది. ఈ విధంగా మనం ఈనాటి వరకు చేసిన మన పాపాల విషయమై మనకు విమో చనము సాధ్యమైయింది. అంతే కాకుండా దేవుని రాజ్య ములో దేవుని కుమారులు ఏ ఆకారంతో మరియు ఏ శరీరంతో ఉంటారో స్పష్టంగా చూపించినాడు. ఎలాగంటే యేసుక్రీస్తు మన పాపముల విషయమై మరణించి, 3 రోజుల తరువాత మరణమును గెలచి, మహిమ శరీరంతో తిరిగి లేచి, అందరికి కనిపించి పరలోకము నకు ఆరోహనుడై వెళ్లినాడు. ఈవిధంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన పాపములకు విమోచనముగాను మనకు ఆశీర్వాదముగా ఉండుటకు తన కుమారున్ని ఈ లోక మునకు పంపెను. 

            దేవుడు మానవుల కొరకు ఇంత ఎందుకు చేసినాడు? ఆయకేమి పనిలేదా? అందుకే ఆయనను కృపామయుడు అంటాము. కృప అంటే ఇదే. దేవుడు మనలను ప్రేమించి అత్యధికమైన కృపతో మనకొరకు (మనం కోరుకో లేదు) ఇంత చేసినాడు. ఆయన మానవులను సృజించుటలో గల గొప్ప ఉద్దేశ్యము యేసుక్రీస్తు సువార్త ద్వారా మనకు వివరిచినాడు. ఇంతగొప్ప కృపను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా?

            ఈ విధంగా మనకు సువార్త ప్రకటించబడింది. దాని పర్యవసానంగా ఎవరైనా సువార్తను విని, అర్ధం చేసుకొని విశ్వసిస్తారో వారికి నిజమైన పశ్చాత్తాపం దేవుడు అనుగ్రహిస్తాడు. 

        ఇంతకి నీవు పశ్చత్తాప పడినావా? ◌