పాపం అంటే ఏమిటి?

18/02/2010 23:24

            చాలామంది ఇది చేయకూడదు అది చేయకూడదు అని చాలా కండీషన్స్ పెడతారు. ఇది చేస్తే పాపం అది చేస్తే పాపం పుణ్యం అని ఏవేవో చెప్తారు. ఏది పాపం? ఏది పుణ్యం? ఏది మంచి? ఏది చెడు? వారి కెలా తెలుసు? అసలు పాపం అంటే ఏమిటి? ఎవరు నిర్వచిస్తారు?

            ఏది పాపమో ఏది పుణ్యమో ఏది మంచో ఏది చెడో నిర్వచించే అర్హత కేవలం మన సృష్టికర్తకే ఉన్నాయి. మనం నిర్వచించటానికి ట్రైచేసి పాపం చేయ కూడదు. ఆయన నిర్వచించాడు మరియు కొన్నిమంచి ఉదాహరణలు ఇచ్చాడు. "ఈ సంగతులు దృష్టాంత రూపకములుగా వారికి సంభవించి, యుగాంతమం దున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను (1 కొరింథీ 10:11)".

            ఎవరైనా ఒక పాపం చేసి దానినుండి మరలక పోతే మళ్ళి అదే పాపం చేస్తారు. మళ్ళి మళ్ళి చేస్తారు. ఎందుకంటే వారు దానికి బానిసైపోతారు. పాపం మని షిని బానిసను చేస్తుంది. స్వాతంత్ర్యం అసలుండదు. ఆ బ్రతుకు మహా భయంకరం. ఎవరో ఒకరు విడిపించేంత వరకు ఆ బానిసత్వంలోనే ఉండిపోతారు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. పాపులను ప్రేమిస్తాడు. పాపం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం చేసిన వారు మరణం అనే జీతం పొందుతారు( రోమా 6:23).  అసలింతకి పాపం అంటే ఏమిటి?

           దేవునివాక్యం ఇలా నిర్వచిస్తుంది. "పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము (1 యోహాను 3:4)". ఏ ఆజ్ఞలు? దేవుని పది ఆజ్ఞలు. అదే ధర్మశాస్రము (Law Of God). దేవుని ఆజ్ఞలు పరిశుద్దమైనవి, నీతిగలవి మరియు ఆత్మసంబంధమైనవి. "కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై యున్నది (రోమా 7:12)", "ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదుము (రోమా 7:14)". మనం అన్ని ఆజ్ఞలు పాటించాలి. "ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయము లో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివైతివి(యాకోబు 2:10,11)." చాలా మంది యేసుక్రీస్తు ధర్మశాస్రము కొట్టివేశాడంటారు. నేను కొట్టివేయలేదు బాబూ అని యేసు చెప్పాడు. "ధర్మ శాస్త్రమునైనను ప్రవక్తల (వచనముల) నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయు టకు నేను రాలేదు (మత్తయి 5:17)". అలా మనం తలంచను కుడా తలంచుకూడదు. ఎవరైతే కొట్టివేశాడంటారో వారు యేసుక్రీస్తునే అబద్దికునిగా చేస్తున్నారు. యేసుక్రీస్తు తు.చ తప్పకుండా ధర్మశాస్రము ను పాటించాడు. యేసుక్రీస్తును వెంబడించువాడే నిజమైన క్రైస్తవుడు. "మీరు తన అడుగుజాడలనుబట్టి నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను (1 పేతురు 2:21)". మరియు "ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొ నువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందు న్నామని దీనివలన తెలిసి కొనుచున్నాము (1 యోహాను 1:5,6)".

ఆ పది ఆజ్ఞలేంటి?

1. నేను తప్ప నీకు వేరోక దేవుడండకూదడు.

2. దేవుని నామమును వ్యర్ధముగా ఉచ్చరింపకూడదు.

3. విగ్రహారాధన చేయకూడదు.

4. విశ్రాంతిదినమును జ్ఞాపకం చేసుకొని పరిశుద్దముగా ఆచరించవలెను.

5. తల్లిదండ్రులను గౌరవించవలెను.

6. నరహత్య చేయకూడదు.

7. వ్యభిచరింపకూడదు.

8. దొంగిలింపకూడదు.

9. అబద్ధ సాక్ష్యం పలుక కూడదు.

10. పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు.

                పై ఆజ్ఞలను గమనించండి. మొదటి నాలుగు ఆజ్ఞలు మనిషికి దేవునికి సంబందించినవి. మిగతా ఆరు మనిషికి మనిషికి సంబందించినవి. "మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట (1 యోహాను 5;3)".  ఒక్కసారి ఆలోచించండి. అందరు ఈ ఆజ్ఞలను పాటిస్తే ఈ ప్రపంచం ఏంత ఆనందంగా ఉంటుందో!!! అసలు దేవుడు మనకు సంపూర్ణ ఆనందం ఇవ్వాలనే ఇష్టపడుతున్నాడు. "గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచు న్నాను (యోహాను 10:10)". కాని మనుష్యులందరు సమానంగా ఒకటి కలిగియున్నారు అది ఏమిటంటే "ఏ బేధమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు (రోమా 3:23)". అయితే దేవుడు తన కుమారుని పంపి మన పాపములకు పరిహారం చెల్లించి నిత్యజీవాన్ని ఇయ్యదలచినాడు. కనుక నిత్యజీవం కావాలో వద్దో మన చేతుల్లోనే ఉంది. "ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము (రోమా 6:23)".

కాబట్టి! ఆజ్ఞాతిక్రమమే పాపము. ◌