పోటీ ప్రపంచం

06/04/2011 20:22

 

ఈ లోకంలో మనిషి పుట్టినది మొదలు చనిపోయే వరకు నానారకాలైన పోటిలను ఏదుర్కొంటున్నాడు. పోటిపడకుండా ఈ ప్రపంచంలో ఏది అంత సులువుగా ఎవరికిరాదు. పోటిపడటం ఈ జీవితంలో ఒక భాగమైపోయింది. అసలు మనం ఎందుకు పోటిపడాలి? ఎవరు ఇలాంటి పరిస్థితిని కల్పించారు? పోటిలేకుండా ఏమి రాదా? మానవుల యొక్క మనుగడకు పోటిప్రపంచం ఒక ప్రాధమిక అవసరమైపోయింది. ఉదాహరణకు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మతాలు, కులాలు, జాతులు, రాజకీయాలు, ఎక్కడ చూసిన పోటితత్వము ఉంటూనే ఉంది .ఒక కవి ఇలా అన్నాడు జీవితమే ఒక పరుగుపందెం. గెలవడానికి పోటీ పడాలి. ఈ రోజున మానవుల యొక్క ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏమిటంటే. మనిషి మనుగడ. అంటే మనిషి ఎలా బ్రతకాలి? (Problem of Human survival). ఈ పోటీప్రపంచములో జీవించడమే పెద్ద సవాలుగా తయారైయింది. ఎందుకంటే ఎవరి స్వార్థం వారు చూసుకొంటున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలది ఇదే తంతు.

 

పోటీతత్వం

 

          పోటీ అనేది ఈ ప్రపంచం యొక్క క్రమము మరియు ధర్మము వలే తయారయినది. పోటీ అనేది దేవుని నుండి కలిగినది కాదు. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. అందరు సోదరబావంతో మరియు ఐక్యత కలిగి జీవించమంటున్నాడు దేవుడు. ప్రేమ, సంతోషం, దయ, సమానత్వం ఇవన్నీ దేవుని నుండి కలుగుచున్నవి. కాని పోటీతత్వం మాత్రం అపవాది అయిన సాతాను నుండి కలుగుచున్నది. ప్రస్తుతానికి సాతాను ఈ లోకాధికారి. మొదటినుండి పోటి మనస్సును వాడే మానవులలో ప్రేరేపిస్తు వస్తున్నాడు. పోటి కేవలం మనుషుల మధ్య వైరాన్ని మాత్రమే పెంచుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడుతుంది. మనుషులను వేరుచేయటానికి మరియు స్నేహభావం తొలగించడానికి సాతాను పెట్టే మొట్టమొదటి ఆలోచనే పోటీతత్వం. మొదట చిన్నగా మొదలై క్రమంగా పెద్దగా ఈ పోటీలు తయారవుతాయి. చదువుల పోటీలు, ఆటల పోటీలు, వ్యాపార పోటీలు, ఉద్యోగాల పోటీలు, మతాల పోటీలు, కులాల పోటీలు, రాజకీయ పోటీలు, దేశాల మద్య పోటీలు ఇంకా ఎన్నోరకాల పోటీల ద్వారా మానవుల మోసం చేసి సాతాను వారిని చెరిపేస్తున్నాడు. ఈ రకంగా పోటీతత్వం మానవుల యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కాబట్టి మానవ నాగరికత ఈ యొక్క పధ్ధతి మీద ఆధారపడి నడుస్తున్నది.   

 

ఫలితం

          ఈ పోటితత్వం కారణంగా మనుష్యుల మధ్య ద్వేషం, స్వార్థం, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ భేధాలు, స్త్రీపురుషుల మధ్య భేధాలు ఇలా అనేకమైనవి ఏర్పడ్డాయి. ప్రస్తుతం అన్నింటి మధ్య కాంపిటీషన్ ఏర్పడింది. ఏదైన కంపార్ చేయడం అందరికి అలవాటైపోయింది. ఈ పోటీ ఫలితంగా మనుషుల్లో వేషదారణ జీవితం బాగా అలవాటై పోయింది. పైకి స్నేహం, భక్తి నటించడం అందరికి అలవాటైపోయింది. అంతేకాకుండా, మోసం చేయడంలోను, నేరాలు చేయడంలోను విపరీతమైన పోటి నెలకొనియుంది. ప్రస్తుత దుష్టప్రపంచానికి కారణం ఈ పోటీతత్వం యొక్క ఫలితమే. ఫలితంగా ఈ ప్రపంచం మానవులు జీవించడానికి సుతక్షితంగాలేని ప్రదేశంగా తయారైయింది.

 

ఆరోగ్యకరమైన పోటీ

          దేవుడు మనిషిని సృజించినప్పుడు వారు పోటీతత్వం కలిగియుండేలా వారిని సృజించలేదు. ఎప్పుడైతే వాడు పాపంచేసి, దేవునికి దూరమై అపవాది యొక్క ప్రభావం వలన ఇలాగ తయారయ్యాడు. కాని ఆరోగ్యకరమైన పోటీ అనేది ఉండాలని అందరు అంటారు. ఇలాంటి పోటి అంటే ఎంటో ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలో లేనేలేదు. నిజానికి ఇది పోటీ కానేకాదు. కేవలం మారుమనస్సు పొందినవారు మాత్రమే కలిగియుండే మనస్సు. వారుమాత్రమే అనుభవించగలిగే మనస్సు. వీరు కేవలం ఇతరుల పట్ల ప్రేమ చూపించడం లోను, మంచితనంలోను మరియు త్యాగం చేయడంలోను పోటీ పడతారు. దీనిని మనం ఆరోగ్యకరమైన పోటీ అనవచ్చు.

            యేసుక్రీస్తు ఈలోకానికి వచ్చి మనుషుల యొక్క నిస్సహాయతను గమనించి, వారి పాపాలను తొలగించటానికి మూల్యం చెల్లించాడు. సంఘాన్ని స్థాపించాడు. పోటీ వద్దని ఒకరికోసం ఒకరిని బ్రతకమన్నాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమించిన ప్రకారం, మనలను ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. సంఘ సహవాసం చేయమన్నాడు. సంఘలో ఎల్లప్పుడు ఆరోగ్యకరమైన పోటి ఉండాలి. ఈ రీతిగా జీవించిన వారిని తన రాజ్యవారసులను చేసాడు. కనుక ఈ లోకానికి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ యేసుక్రీస్తు. భాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ లోకం పోటితత్వంతో జీర్ణించుకుపోయింది. దీని నుండి మనిషి మార్పుచెందవలసిన అవసరం ఉంది.

 

సమానత్వం

          దేవునికి పక్షపాతం లేదు. అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. తన సంఘములో ఏలాంటి పోటిని ఆయన నిర్థేశించలేదు. దేవుని సంఘం ఒక కుటుంబం వంటిది. తన రాజ్యం ఈలోక సంబంధమైనది కాదని, మరియు తన రాజ్య వారసులు ఈలోక సంబందుల వలేకాక ప్రేమతో, ఐక్యతతో మరియు సమానత్వంతో జీవించాలని భోధించాడు. పోటితత్వం అనేది ఈ లోక మర్యాద. కనుక ఎవరైతే ఈలోక మర్యాదను విడచి మార్పునొంది, దేవుని మార్గములో జీవిస్తారో వారే దేవుని రాజ్య చేరతారు. మీరు లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.(రోమా 12:2)