మనకేం కావాలి?

28/04/2010 10:41

             లైఫ్ చాలా ఆనందంగా గడచిపోవాలి. ఏ కొదువ ఉండకూడదు. మంచి జాబ్ కావాలి. లైఫ్ లో సెటిలవ్వాలి. మంచి లైఫ్ పార్టనర్ కావాలి. ఇవన్ని జరుగటానికి అవసరమైతే దేవునికి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ఏం సమస్య లేదు. అసలు దేవుడున్నాడా లేదా మనకవసరం లేదు. మన పని జరిగిందా లేదా అన్నదే మన సమస్య. So, ఇవన్నీ అలా అలా జరిగిపోతే మనం హ్యాపీ.

            ఇవన్నీ అలానే జరిగాయనుకొండి. ఐతే ఏంటి? తరువాత ఏంటి? తెలియదు. సరే ఇవన్నీ జరిగి సాధ్యమవటానికి ‘నేను’ అనే వాడిని ఉన్నాను. అలా అలా జరగాలని ‘నా ఆలోచనలు ఉన్నాయి’. అయితే నేనెవరు? నాకిన్ని ఆలోచనలు ఎక్కడివి? ‘నేను అనే జీవి ఇక్కడకెందుకు వచ్చాను?’ ఎలా వచ్చాను?

            “ఇన్ని ప్రశ్నలు నాకెందుకు? ఇవన్నీ ఆలోచించడం నా వల్లకాదు. ఈ లైఫ్ ఎలా వచ్చిందో అవసరంలేదు కాని దానితో ఎంజాయ్ మాత్రం చేస్తాను. వచ్చినదాన్ని (జీవితాన్ని) ఆనందంగా అనుభవించి పోతేపోలా? లేదా లైఫ్ చివరిలో ఆలోచిస్తేపోలా? ఇప్పుడే ఎందుకు?” అని అనుకుంటే ఎలా ఉంటుందంటే ---“ ఎవరో నాకు ఒక కోటి రూపాయలు పంపించారు కాని వాళ్లెవరో నాకు తెలియదు. తెలుసుకోవలసిన అంత అవసరం కూడా లేదు. నాకు కోటి రూపాయలు వచ్చాయి అదే చాలు” అని అనుకునేవాళ్లలా ఉంటుంది. ఈ విధమైన వ్యక్తులు దేవునికిగాని లేదా చర్చీకి వెళ్ళల్సిన అవసరంగాని లేదు. మీరేమంటారు?

            ఎవరైతే తలాతోక లేని జీవితాలు జీవిస్తూ అర్ధం పర్ధం లేని పనులు చేస్తూ ఆధారం(Proof) లేని విషయాలను గ్రుడ్డిగా నమ్ముతూ ఏం చెయ్యాలో తెలియక ఏదో ఒకటి చేసేవారు దేవునికి అవసరమంటారా? మీరేమంటారు?

            ఇంతవరకు మానవులకు లైఫ్ ఎలా వచ్చిందో తెలియదు. ఇంకో లైఫ్ ను సృష్టింపలేరు. దేవుడిచ్చిన జీవితాన్ని మరియు ఈ సృష్టిని అనుభవించడం మాత్రం తెలుసు కాని, దానిని మనకిచ్చిన వానిని తెలుసుకోవాలి అనే ఆలోచన మాత్రం రాదు. ఆయన శక్తిని గుర్తించలేరు.

            దేవుడు జీవాధిపతి. అనేక రకాలైన జీవులను సృజించినాడు. గమనించండి. దేవుడు శూన్యము(Out of Nothing) నుండి ఇంతమహా సృష్టిని సృజించాడు. ఈ సృష్టిని అందులో ఉన్న వాటినన్నిటిని తెలుసుకోవటానికి మానవుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. తెలుసుకోవల్సింది ఇంకా చాలా ఉంది. ఈ సృష్టి అంతములేనిది.

గమనించండి. సైన్సు చెప్పెదొక్కటే. అదేమిటంటే “ఈ సృష్టిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉందో తెలియపరుస్తుంది. కాని అక్కడ అవి ఎందుకున్నాయో చెప్పలేదు.” కేవలం దానిని సృష్టించినవాడు మాత్రమే చెప్పగలడు.

        దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. మోసపోవద్దు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును ఇచ్చువాడు దేవుడు. “విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి......”(2కొరింథీ 9:10). కేవలం శ్రద్దకలిగి సత్యాన్ని వెతికే వాళ్లకు దేవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈ లోకం ప్రస్తుతం ఎలా ఉందో అర్ధమౌతుంది. అప్పుడు మాత్రమే మనకేం కావాలో అర్ధమౌతుంది.