మానవుడే మణిహారం

18/02/2010 23:44

              ఇప్పుడే పుట్టిన బిడ్డను మరియు 80 యేళ్ళ ముసలివాడిని చూడండి. ఏంటి తేడా? ఎప్పుడైన గమనించారా? వారి విలువ ఏంటి? భూమి మీద ఉన్న జీవులన్నిటిలో మనిషికి మాత్రమే ఇంత ప్రత్యేకత ఏంటి? మనం ఈ భూమి మీద ఎందుకు ఉన్నాం? ఎక్కడి నుంచి వచ్చాం? మరియు ఎక్కడికి వెళుతున్నాం?

అవసరం: -

             ఈ ప్రశ్నలన్నిటిని వెసుకోవటం అంత అవసరమా? అంటే అవసరమే. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నిటిని వేయ గలిగినది మనిషి మాత్రమే. జంతువులు వేయ లేవు. మనం నిత్యం చేసే పనులను కొంచం గమనిస్తే అర్దమ వుతుంది. మనం చేసే ప్రతి పనికి ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది. ఉదా:- మనం ఏది పడితే అది తినం, ఎక్కడ పడితే అక్కడ నివసించం. ఎందుకంటే అలా చేస్తే ఏం అవుతుందో తెలుసు కాబట్టి. అన్ని తెలుసుకొనే సామర్ద్యం మనకు ఉన్నది అని తెలుసు. కాని కొన్ని తెలుసు కోవడం అంత అవసరమా అని కొట్టి పారేస్తాం. అయినా పై ప్రశ్నలకు ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి.

మతం;- 

            సమస్య ఏమిటంటే వాటిని తెలుసుకోవడం కోసం, తెలియచెప్పడం కోసం చాలా మతాలు వెలిసాయి. నిజానికి ఏ మతం వాటిని వివరించలేకపోయింది.  క్రైస్తవులనే వారికి(సాంప్రదాయ క్రైస్తవులు)  కూడా తెలియదు. 1950 సంవత్సరం వరకు మనుషులందరు మనకు చాలా విషయాలు తెలియదు అని అనుకొనెవారు. ఇప్పుడైతే మనకు తెలియనిది ఇంక ఏమి లేదు అని అనుకొంటున్నారు. ఇక్కడే అసలు point miss అవుతుంది. ఈ ప్రశ్నలన్నిటిని science తో వివరించాలనుకోన్నారు కాని సాధ్యపడలేదు. ఎంతో వివరించాలనుకో న్నారు కాని ఎప్పటికప్పుడు తప్పులు ఉంటునే ఉన్నాయి. మరియు వాటి వివరణ ఎప్పటికప్పుడు మార్పుచేయడం జరుగుతుంది. Science వివరణ ఒక్కటే "దేవుడు లేకుండా సృష్టి గమనం ". కాని Proof లేదు. Theory మాత్రమే ఉంది. అంటే ఊహించి చెప్పేది. దేవుని వాక్యం (ప్రవచనం) మానుష్యుల ఇచ్చను బట్టి కాని ఊహను బట్టి కాని వ్రాయబడలేదు. అది పూర్తిగా డేవుని మాట.

నియమాలు-ఆజ్ఞలు:-

             ప్రకృతి సంబందియైన మానవుడు దేవుని సంగతులు ఖచ్చితంగా అర్దం కావు. దేవుని ఆత్మగలవారికి మాత్రమే అర్దంమవుతాయి. Sincereగా అడిగితే దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఖచ్చితంగా చెపుతుంది---దేవుడు లేడని బుద్దిహీనుడు (ప్రకృతి సంబంధి) తన మనస్సులో అనుకోంటాడు. ఉండేవాడు కాదు. 'God’s existence is a terrific reality’ దేవుడు 1/కోటి వంతు కూడా compromise కాడు. ప్రేమ అంటే ఏమిటో తేలుసా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు (Law of Love). ఆజ్ఞలు ప్రేమ కాక పోతే క్రీస్తు మన కోసం ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు కాదు. ఒక mobile కొన్నప్పుడు దానిని ఎలా ఉపయోగించాలో తెలియజేసే ఒక పుస్తకం ఉంటుంది ( instructions book ). మోబైల్ ఒక్కటే కాదు బస్సు, విమానం, కారు మరి ఏదైనా తయారుచేసిన తరువాత వాడే విధానం తెలిపే పుస్తకం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పుస్తకం లేకపోయినా లేదా తయారుచేసిన వాడు చెప్పక పోయినా వాడే విధానం ఖచ్చితంగా తెలియదు. అలాగే దేవుడు సృష్టయావత్తును మరియు మనిషిని సృష్టించి వాడే విధానం తెలిపే పుస్తకం ఇచ్చాడు. దేవుడి నోటి నుండి వచ్చు ప్రతిమాట (whole bible) వలన జీవించాలి. మనిషి జీవించు విధానం అంటే సకల సృష్టితో జీవించు విధానం. ఏమి చేయాలో ఏమి చేయకూడదో (నియమా లు) ఆ పుస్తకములో వ్రాసిఇచ్చినాడు.

మనిషి :   

            అయితే మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే –బస్సు తయారు చేసిన తరువాత దానికి మైండును కూడా (అంటే సొంత నిర్ణయాలు తీసుకొనె సామర్ధ్యం) కూడా ఇచ్చిన తరువాత ఆ బస్సు—"నేను ప్రయాణ సాదనంగా(లేదా సౌకర్యంగా) పని చేయను నేను టెలిస్కో పులా పని చేస్తాను" అని అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. గమనించండి! దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు స్వచ్చ మైన అద్దం లాంటిది. మనం రోజు అద్దంలో చూసుకొని మనల్ని మనం సరిచేసరికుంటాం. మనం అద్దంలో చూసినప్పుడు మన మచ్చలను చూపిస్తుందని మనం అద్దం పగులగొట్టం కదా! మనం దానిలో చూసి సరిచేసుకొంటాం. ఎవరైనా ఆజ్ఞలు లేవని( లేదా కొట్టివేయబడినవి ) అని కాని అంటే – అద్దంలో చూసి, మన మచ్చలను చూపిస్తుంది కనుక అద్దం పగులగొట్టె వారితో మూర్ఖులతో సమానం.

ఒక విషయం:-

            దేవుని రాజ్యమునకు వారసుడవుటకు నేనేమి చేయవలెను అని ఒకడు యేసును అడిగినప్పుడు వెంటనే "ఆజ్ఞలు అవసరం లేదు నాయందు విశ్వాసం ఉంచు సరిపోతుంది". అని అనలేదు. కాని దేవుని ఆజ్ఞలన్నిటిని పాటించమన్నాడు. అతడు దేవుని ఆజ్ఞల విలువ(ప్రేమ) తెలుసుకోకుండా గుడ్డిగా పాటించుచున్నందున ఫలం అతనిలో లేదు(కొరింధి 13:1 –4 ప్రకారం ). అందుకు యేసు పరిపూర్ణుడవుటకు సెలవిచ్చెను. "దేవునికి వేరుగా ఉండి మనం సాధించేదేమిలేదని యేసు ఖచ్చితంగా చెప్పాడు(యోహాను 15:5)". దేవుడు ఇప్పుడే ప్రపంచానంతటిని రక్షించటానికి పూనుకొలేదు. ప్రస్తుతం ఏర్పరచబడినవారు కొందరే. అందుకే అతడు వ్యసనపడి వెళ్ళిపోతున్నా ఆపి బతిమాలలేదు.

ధర్మశాస్త్రము:- 

            ధర్మశాస్త్రము అద్దం లాంటిది. మన శరీరం లో కొన్ని వ్యవస్తలు (జీర్ణ, శ్వాస, మూత్ర, నాడీ) ఉన్నాయి. అవి కొన్ని నియమాలను అనుసరించి పనిచేస్తాయి. మనకు రోగం వచ్చింది అంటే ఈలాంటి వ్యవస్తలలో ఎక్కడో నియమం తప్పినదని అర్దం. దేవుడు మన భౌతిక శరీరానికి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఎప్పుడైతే అవి నియమం తప్పుతాయో సరిగా పనిచేయడం మానేస్తాయి.అప్పుడే మనిషికి రోగం వస్తుంది. ఉదా: - తినేదానికంటే ఎక్కువ తిన్నా లేదా తక్కువ తిన్నాసమస్యే. ఈ నియమం తప్పడం వల్ల అజీర్తి కాని, గ్యాస్ కాని వస్తాయన్న మాట. అలాగే ప్రతి రోగానికి సంబందించిన నియమం అతిక్ర మించుట వలన రోగం వస్తుంది. భౌతిక జీవితం లాగనే ఆధ్యాత్మిక జీవితం కూడా! ధర్మశాస్త్రము ఆత్మ సంబం ధమైనది (రోమా7:12,14). ఈ నియమాలు(పది అజ్ఞలు) తప్పితే ఆధ్యాత్మిక రోగం వస్తుందన్న మాట. అదే పాపం వలన వచ్చు జీతం. దీనినే దేవుని వాక్యం "రెండవ మరణం" అంటుంది.

ఫలితం:-  

            దేవుడు న్యాయవంతుడు. న్యాయం నియమాలతో ముడిపడిఉంది. ప్రస్తుతం మానవ జీవితం చాలా దుర్భరంగా ఉంది. ఆ విషయం దేవునికి తెలియక కాదు. మనిషి దేవుని మీద ఆదారపడకుండా తీసుకున్న నిర్ణయ ఫలితమే ఈ పరిస్థితి. ఈ విషయం మానవుడు గ్రహించాలని దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. కాని దేవుడు కఠినాత్ముడు కాడు. ఎమిటి మనిషి తీసుకొన్నఆ నిర్ణయం? అదే ఆదాము చేసినది? మనిషికి దేవుని మీద ఆదారపడ టం అంటే ఏమిటో తెలియదు. అది మానేసి వేల సంవ త్సరాలైంది. దేవుని మీద ఆదారపడటమే విశ్వాసము. అవిశ్వాసం ఆదాము దగ్గరే మొదలైంది. దేవుడు చెప్పిన దానిమీద ఆదార పడకుండా సొంత నిర్ణయం తీసుకొన్నాడు. "విశ్వాసమే ధర్మశాస్త్రమను స్థిరపరచును"( రోమా 3:31). మనం వాటిని నెరవేర్చలేం కదా అని ప్రకృతిసంబంధులంటారు. అయితే దేవుని సమా ధానం –"మనుష్యులకు అసాధ్యమేకాని దేవునికి సమస్తము  సాధ్యమే" (మత్తయి 19:25). దేవుని పైన ఆధారపడటం అంటే ఇదే!

నువ్వునేను:- 

                 అసలు మన భవిష్యత్తు ఎంత ఉన్నతమైందో నిజంగా తెలుసుకొంటే బుర్ర పాడువతుంది. అసలు దేవు డు మనలను ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడో అర్ధం కాదు. నిజానికి నువ్వునేను దేవుని పోలిక. మనం అచ్చుగుద్దినట్లు దేవుని పోలికలో ఉన్నాం. దేవుడు సృష్టంచిన వాటన్నిటిలో మనిషే మణిహారం (master piece). మనలను సృజించి మనలో మరియు మనపై కొన్నినియమాలు(మన ఆనందం కోసమే) నియమించాడు. నిజానికి అవి దేవునివే. మరి మనకెందుకు ఇచ్చినట్లు. ఎందుకంటే మనం ఆయన పోలిక. ఈ ధర్మశాస్త్ర ము జంతువులకు లేదు. దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. "ఆయనను ఎరిగియున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్దికుడు. వానిలో సత్యము లేదు.(యోహాను 2:4)". ఈ సత్యమునకు సాక్షమే యేసు క్రీస్తు జీవితం. యేసు పది ఆజ్ఞలు ఖచ్చితంగా నెరవేర్చాడు. పౌలు కూడా నెరవేర్చాడు(శిష్యులందరు కూడా). ఇప్పటికే నియమనిబందనలు లేని లోకం చూస్తున్నాం. మీకు తెలియదేమో కాని 90% దేశాల్లో హద్దులు(నియమాలు) పేరుకు మాత్రమే ఉన్నాయి. నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది. అప్పుడు నోవాహు 100 సంవత్సరాలు ప్రపంచాన్ని దేవుని శిక్షను గూర్చి హెచ్చరించాడు. ఇప్పుడు కూడా అలాంటి హెచ్చరికే ఈ ప్రపంచానికి జరుగుతుంది.

మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ◌