యేసుక్రీస్తు మంచి శుక్రవారం చనిపోలేదు & ఆదివారం తిరిగి లేవను లేదు

28/04/2010 10:37

                యేసుక్రీస్తు మంచి శుక్రవారం చనిపోయాడని మరియు ఆదివారం తిరిగి లేచాడని సంప్రదాయ క్రైస్తవులు నమ్ముతారు. మరియు మంచి శుక్రవారం, ఈస్టర్ పండుగలుగా ఆచరిస్తారు. అసలు యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయాడా? ఆదివారం తిరిగి లేచాడా? దేవుని వాక్యం ఏమి చెపుతుంది?

                 ప్రవక్తయైన యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఉన్నట్లు యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో మూడు రాత్రింబగళ్లు ఉంటాడని తానే స్వయంగా చెప్పినాడు. “వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచకక్రియైన వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఏలా గుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. ”  (మత్తయి 12:39,40). ఇంతకి యేసుక్రీస్తు ఏ రోజున చనిపోయెను?

            యేసుక్రీస్తు పస్కా పండుగనాడు చనిపోయెను. “రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.”(మత్తయి 26:2). యేసు పస్కాను సిద్దపరచమని శిష్యులతో చెప్పెను. “పస్కాను వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి - మీరు వెళ్లి మనము పస్కాను భుజించుటకై మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.”(మత్తయి 22:7,8). ఆ రాత్రి యేసు శిష్యులతో కలసి పస్కాను ఆచరించెను.

               తెల్లవారుచుందనగా ఇంకా చీకటి ఉండగానే ఇస్కరియోతు యూదా యేసును రోమా సైనికులకు పట్టించెను. ఆ రాత్రి విచారణ కొరకు ప్రభువును నానా హింసలు గురిచేసినారు. ఆ తరువాత అన్యాయమైన తీర్పు తీర్చి సిలువ మరణముకు ఆయనను అప్పగించారు. యేసు మధ్యాహ్నం 3 గంటలకు సిలువ మీద మరణించెను. ఆ దినము పస్కాను సిద్దపరిచి ఆచరించు దినము. తరువాత దినము పులియని రొట్టెలపండుగ. పండుగనాడు సిలువమీద వారిని ఉంచకుండా చేయాలని యూదులు పిలాతును అడిగిరి. “ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినమున సిలువమీద ఉండకుండునట్లు వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతును అడిగిరి.”(యోహాను 19:31). కాని అప్పటికే యేసు మరణించెను.

            తరువాత పులియని రొట్టెలపండుగనాడు ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతునొద్దకు వచ్చి సమాధిని జాగ్రత్తగా కాపలవుంచాలని అడిగిరి. ఎందుకంటే మూడు దినములైన తరువాత యేసు లేచెదనని చెప్పిన విషయం అందరికి తెలుసు. “మరునాడు, అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున(పండుగ రోజున) ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతునొద్దకు కూడి వచ్చి అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు - మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినపర్యంతము సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొనిపోయి - ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటిది మరి చెడ్డదై యుండుననిచెప్పిరి.”(మ త్తయి 27:62-64).

             కనుక యేసు ఖచ్చితంగా మూడు రోజుల తరువాత (అంటే మూడు రాత్రులు మూడు పగళ్లు తరువాత అంటే 72 గంటల తరువాత) మరణం గెలచి తిరిగిలేస్తానని చెప్పినాడు. కాని యేసు మంచి శుక్రవారం చనిపోతే మూడు రోజుల తరువాత అంటే సోమవారం తిరిగి లేవాలి. కాని అలా జరుగలేదు. కాబట్టి ఆయన మంచి శుక్రవారం చనిపోలేదు. మరి ఎప్పుడు చనిపోయాడు?

యేసుక్రీస్తు సిలువ మరణం

            యేసుక్రీస్తు పస్కా పండుగనాడు చనిపోయెను. సమాధి కూడా చేయబడెను. తరువాత రోజు  పులియని రొట్టెలపండుగ వచ్చును. ఇది వారం రోజుల పండుగ. పండుగలో మొదటి రోజు మరియు చివరి రోజు విశ్రాంతిదినాలు. “మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పు ము.”(లేవి 23:6-8).

            పండుగలో రెండవరోజు గలిలయనుండి యేసుతో పండుగకు కూడ వచ్చిన స్త్రీలు ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి. “విశ్రాంతిదినము(పులియని రొట్టెలపండుగ మొదటిరోజు) గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.”(మార్కు 16:1).  ఆ తరువాత రోజు వారాంతపు సబ్బాతుదినం. కాబట్టి వారు కొనిన సుగంధ ద్రవ్యములను పరిమళతైలములను యేసునకు పూయకుండా ఆజ్ఞ ప్రకారం విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి. “అప్పుడు గలిలైయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో దానిని చూచి తిరిగి వెళ్లి, సుగంధద్రవ్య ములను పరిమళతైలములను సిద్ధపరచి, ఆజ్ఞ చొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.”(లూకా 23:55,56). 

            కాబట్టి యేసు చనిపోయి వారాంతపు సబ్బాతుదినానికి మూడు రోజులైనది. యేసు విశ్రాంతిదినమున మరణం గెలచి తిరిగి లేచెను. మూడు రోజుల తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా  ఇద్దరు స్రీలు సమాధిని చూడవచ్చిరి. కాని అప్పటికే యేసు తిరిగి లేచియుండెను. “విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.” (మత్తయి 28:1). కాని ఈ వచనం తప్పుగా తర్జుమా అయ్యింది. ఎందుకంటే ఆ వారంలో రెండు విశ్రాంతిదినములు ఉన్నాయి. ఒరిజినల్ గా గ్రీకులో ఇలా వ్రాయబడి ఉంది. “విశ్రాంతిదినములు గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా....” (మత్తయి 28:1).

    

మంగళ

వారం

బుధవారం

గురువారం

పస్కాకు ముందు రోజు

పస్కా పండుగ రోజు

పులియని రొట్టెలపండుగ రోజు

(విశ్రాంతి దినం)

13 తేధి

పగలు

14 తేధి రాత్రి

14 తేధి పగలు

15 తేధి రాత్రి

15 తేధి పగలు

యేసు పస్కాను సిద్దపరచమని శిష్యులతో చెప్పెను.

యేసు శిష్యులతో కలసి పస్కాను ఆచరించెను. (సూర్యాస్తమయం తరువాత)

యేసు మధ్యాహ్నం 3 గంటలకు సిలువ మీద మరణించెను.

పులియని రొట్టెలపండుగ

ప్రారంభం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శుక్రవారం

శనివారం

ఆదివారం

పండుగలో రెండవ దినం

పండుగలో మూడవ దినం. వారాంతపు విశ్రాంతిదినం

పండుగలో నాల్గవ దినం.

16 తేధి రాత్రి

16 తేధి పగలు

17 తేధి రాత్రి

17 తేధి పగలు

18 తేధి పగలు

యేసుతో పండుగకు కూడ వచ్చిన స్త్రీలు ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.

యేసు మరణం నుండి తిరిగి లేచెను.

మూడు రోజుల తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా ఇద్దరు స్రీలు సమాధిని చూడవచ్చిరి.

 

 

 

 

 

 

 

                   పైన టేబుల్లో చూపిన విధంగా మూడు రాత్రులు మూడు పగళ్లు సమాధిలో ఉండిన తరువాతే యేసు తిరిగి లేచినాడు. కనుక యేసు బుధవారం సిలువమీద మరణించినాడు. మరియు శనివారం అంటే విశ్రాంతిదినమున (పరిశద్ధినం) పునరుద్దానం చెందినాడు. “లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.”(1 కొరింథీ 15:4).

             ఒకవేళ విశ్వసించాలన్నా, శుక్రవారం మధ్యా హ్నం నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు 1 ½ రోజులు మాత్రమే అవుతుంది. చాలామందికి దేవుని పరిశుద్ద పండుగల గూర్చిన అవగాహన లేకపోవడం కారణంగా గుడ్ ప్రైడే మరియు ఈస్టర్ వంటి దేవుని వాక్యంలోలేని పండుగలను పాటిస్తున్నారు.

            యేసు తన మరణ పునరుద్దానములను పండుగలుగా అచరిచమని ఎన్నడు చెప్పలేదు. కనుక ఇదే సమయం. నీతికి సత్యా నికి నిలబడి పితృపారంపర్యంగా వస్తున్న ఆచారాలను దేవుని వాక్యంలో లేని పండుగలను విసర్జిపవలెను. దయ్యములు కూడా దేవునికి భయపడి వణకుచున్నవి. “దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.”(యాకోబు 2:19).

        మరి నీవు దేవునికి భయపడుతున్నావా? అనేదే అసలైన ప్రశ్న. ◌