విశ్రాంతిదినమును జ్ఞాపకము చేసుకో....

18/02/2010 23:09

మనం ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఎవరు వెళ్లమన్నారు? యేసయ్య వెళ్ళమన్నాడా? అలా అని బైబిల్లో ఏక్కడా లేదు.

                 అది సరే! యేసు తన జీవితకాలములో సమాజ మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాడు? చిన్న నాటి నుండి ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరా నికి వెళ్ళడం ఆయన అలవాటు. "తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా...(లూకా 4:16)". తన సేవ మొదలుపెట్టిన తర్వాత ప్రతి విశ్రాంతిదినమున ఆయన భోధించాడు "విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు (లూకా 13:10)". యేసుక్రీస్తు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు. ఆయనే దానిని సృష్టించినాడు "అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినము నకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను (మార్కు 2;28)".

            యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఆరోహనుడైన తరువాత అపోస్తులుడైన పౌలు యేసునందు విశ్వాసముంచి దేవుని పరిచర్య చేసినాడు. మరి పౌలు ఏ రోజును పాటించాడు? పౌలు కూడా యేసుక్రీస్తు మాదిరిగానే విశ్రాంతిదినమునే పాటించాడు. "గనుక పౌలు తన వాడుకచొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి - క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట అవశ్యమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములు తర్కించుచుండెను (అ.కా 17:2,3)". పౌలు అన్యుల దేశాలలో దేవుని సేవా చేసినాడు. అయినా సరే ప్రతి విశ్రాంతిదినమున మాత్రమే బోధించెను. "అతడు ప్రతి విశ్రాంతిదినమున సామాజ మందిరములో తర్కించుచు, యూదులను హెల్లేనీయులను ఒప్పించుచుండెను (అ.కా 18:4)".

            ఈ వచనం గమనించండి: "వారు సమాజ మందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి (అ.కా 13:42)". పౌలుగారు ఈ విధంగా తన బోధను Next విశ్రాంతిదినమున కొనసాగించారు. ఆదివారంలో బోధించినట్లు ఒకే ఒక్కచోట వ్రాయబడింది. "ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుం డెను (అ.కా 20:7)". ఇక్కడ సందర్బాన్ని గమనించండి! దేవునివాక్యం ప్రకారం శనివారం సూర్యాస్తమయంతో ఆదివారం మొదలౌతుంది. "అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (ఆ.కా 1: 5,8,13)". మరియు ఆదివారం సూర్యాస్తమయంతో సోమవారం మొదలౌతుంది. పౌలు శనివారం సూర్యాస్తమయం దాటి అర్ధరాత్రివరకు (అంటే ఆదివారంలో) ప్రసంగిచాడు. ఆ అర్ధరాత్రి వారితో బోజనం(ఆదివారంలోనే రొట్టే విరిచా డు) చేసాడు. మరలా తన తెల్లవారు వరకు ప్రసంగం కొనసాగించాడు. ఎందుకంటే మరునాడు ఉదయమునే అక్కడ నుండి వెళ్ళనైయున్నాడు. ఇదే వారికి ఆయన చివరి ప్రసంగం. ఆ తర్వాత ఆయన యెరుషలేంలో హతసాక్షి అయినాడు. నిజానికి ఆ యొక్క కూడిక శనివారమే (విశ్రాంతిదినమునే) మొదలైంది కాని అలా కొనసాగించాడు. ఎందుకంటే ఆ యొక్క సందర్భం అలాంటిది.

            ఈ విధంగా మన మొదటి క్రైస్తవులు విశ్రాం తిదినమును పాటించారు. విశ్రాంతిదినం అంటే శనివారం. ఏందుకంటే విశ్రాంతిదినము తరువాత ఆదివారం వచ్చును. "విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా (మత్తయి 28:1)".

విశ్రాంతిదినము పాటించటం దేవుని ఆజ్ఞ

            విశ్రాంతిదినము అంటే దేవుని సబ్బాతు దినం. సబ్బాతు అంటే విశ్రాంతి (Rest) అని అర్ధం. దేవుడు మొదటి ఆరు రోజులు ఈ సృష్టికోసం పనిచేసి ఏడవ రోజున విశ్రమించాడు. "దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవ దినమున విశ్రమించెను (ఆ.కా 2:2)". మరియు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్దపరచాడు. గమనించండి. దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్దపరచాడు. "కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను (ఆ.కా 2:3)". ఆనాటి నుండి ఏడవరోజు సృష్టికర్తకు తన ప్రజలకు గుర్తుగా ఉంది. "ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము (నిర్గమ 31:16,17)". పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము (నిర్గమ 20:8)". గమనించండి. ఇది సలహా కాదు. ఆజ్ఞ. "ఆజ్ఞాతిక్రమమే పాపము (1 యోహాను 3:4)". ఇది చిన్న విషయం కాదు. క్రైస్తవులు అని చెప్పుకొనే వారు దేవుని యందు భయభక్తులు కలిగియుండ వలెను. యేసు చెప్పేను -నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను.

        మరి ఆదివారం ఆరాధనా ఎక్కడనుండి వచ్చింది? మొట్టమొదటి అబద్దం వలెనే(next article) సాతాను సర్వలోకమును మోసం చేసి దేవునికి దూరం చేసాడు. కాని ఈ విషయంలో మోసపోయం అని అంటే అందులో దేవుని తప్పేంలేదు.  ఎందుకంటే "మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును (గలతి 6:7)". సత్యం ఎప్పుడు మనందరికి అందుబాటులోనే ఉంది.

             కాబట్టి! ఇప్పుడు కూడా "ది బాపట్ల చర్చ్ ఆఫ్ గాఢ్" సత్యమును అందరికి అందుబాటులోకి తెస్తుందే కాని ఎవరిని ఎన్నడు బలవంతం చేయదు. ఎవరికి వారే నిర్ణయం తీసుకోవలెను. విశ్రాంతిదినాన్ని మనందరం జ్ఞాపకం చేసుకొని పరిశుద్దంగా ఆచరించవలెను. ◌