సంపాదకీయం

18/02/2010 22:52

 ప్రియమైన పాఠకులకు,

                          దేవుని నామమున మీ అందరికి శుభములు. దేవుని కృప వలన సెప్టెంబర్ 19, 2009 న "బాపట్ల చర్చ్ ఆఫ్ గాఢ్" అనే దేవుని సంఘమును ప్రారంభించినాము. ఈ సంఘమునుండి దేవుని సత్యసువార్త ప్రపంచానికి బయలువెలుతుంది. ప్రస్తుతం దేవుని గురించి, దేవుని సంఘమును గురించి మరియు దేవుని రాకడ గురించి ఇంతకు ముంద్దెన్నడు లేనంతగా ప్రచారం జరుగుతుంది. కాని నిజమైన సత్యసువార్త బైబిల్ లో ఉన్నది ఉన్నట్టు ప్రకటింపబడుట కనబడుటలేదు. కావున దేవుని ప్రేరణతో ఈ పనిని ప్రారంభించినాము. దేవునియొద్ద నుండి ఉచితంగా పొందిన దేవుని జ్ఞానసంపదను ప్రజలకు ఉచితంగానే ఇవ్వదలచినాము (మత్తయి 10:8). దేవుని వలన ఈ responsibility పొంది చాలా నమ్మకముగా దేవుని దృష్టికి అంగీకారముగా ఉండునట్లు ఈ సేవాభారము కలిగి ఆయన శక్తితోనే కొనసాగించుటకు ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క నడిపింపు లేనిదే ఏ క్రైస్తవ జీవితం కొంచం కూడ ముందుకు సాగదు.

        అసలు దేవుని సృష్టిలో అత్యున్నతమైన సృష్టి “మనిషి”. మనిషి దేవుని పోలిక. అయితే ఎందుకు ఈ సృష్టి అన్నదే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒక విషయం మరిచిపోవద్దు కారణం లేనిదే ఏదియు సృష్టింపబడదు. దీనినే Law of Cause and Effect అని అంటారు. There must be a cause behind each and every effect. This is a universal law. అలాగే ఈ సంఘం ఏర్పాటుకు ఒక కారణం, ఈ పత్రిక స్థాపించుటకు ఒక కారణం ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఈ యావత్ సృష్టికి, మన సృష్టికి నిజమైన ఖచ్చితమైన కారణం ఉన్నది. ఇదే అసలు జ్ఞానం. ఈ జ్ఞానం తెలిస్తే మన హృదయాంధకారం పోయి జ్ఞానం వస్తుంది.

        మానవ చరిత్రలో నజరేయుడైన యేసు అను ఒక వ్యక్తి ఈ భూమి మీద సంచరించి ప్రకటించినదేంటి మరి? ఈ జ్ఞానమే మరి. బైబిల్ లో వెతకండి మరి! అన్నీఉండి కూడ అర్దంచేసుకోకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. కంగారుపడద్దు. ఈ విషయాలన్ని దేవుని వాక్యపు వెలుగులో (with proof) ఈ సంఘపరిచర్య ద్వారా ప్రకటింపబడుతుంది. మీరు ఖచ్చితంగా ఆశ్యర్యపోతారు. జ్ఞానం సంపాదిస్తారు. మీరు చేయవలసిందల్ల ఒక్కటే నమ్మకముగా open mindతో న్యాయంగా ఆలోచించడం. కాని ప్రస్తుతం జనాలకు తీరిక లేదు. ఎంత లేదంటే వారి గురించి వారే ఆలోచించేంత తీరిక లేదు. ఒకవేళ తీరికున్న దేవుని గురించి ఆలోచించేంత interest లేదు. వాక్యమే సత్యం. దీనికి కూడా proof ఉంది. ఏది గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే దినములు చెడ్డవి. నీవు మోసపోతావు అంటే మోసం చేయడానికి అనేక మంది readyగా ఉంటారు. కాని దేవుడు నమ్మకమైనవాడు. మనం ఖచ్చితంగా నమ్మచ్చు. అయితే ముందుగా మనం ఆలోచించే పద్దతి మారాలి (Our way of thinking must be changed). మీరు ఇంతవరకు "దేవున్ని నమ్ముకోవాలి, ఆశీర్వ దించబడాలి, ఏ కొరత ఉండకూడదు, పరలోకానికి వెళ్ళాలి" అన్న ఆలోచనా ధోరణిలో మాత్రమే ఉన్నారు. ఇలా ఉండకూడదు. మనకు సృష్టికర్తతో సంబంధం ఏర్పడితేనే గాని మన future వాక్యంలో తెలిపినట్లు ఉండదు. కాబట్టి దేవునితో సంబంధం ఏర్పడటమే ముఖ్యం. అప్పుడు ఆయన మనకు తండ్రి మనం ఆయనకు కుమారులం అవుతాం. కాబట్టి దేవుని వాక్య సత్యాలను క్రమంగా దేవుని పద్దతిలో నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను.

        మా పత్రిక ప్రస్తుతకాల పరిస్ధితులను రాబోవుకాల పరిస్థతులను దేవుని ప్రవచన వాక్య వెలుగులో వివరిస్తుంది. అంతేకాకుండా వాక్యం ప్రకారం మనం ఎక్కడున్నాం మరియు ఎక్కడికి వెళుతున్నాం అనే ప్రశ్నలను వాక్య వెలుగులో వివరిస్తుంది. ప్రస్తుతం కాలం చాలా భయంకరంగా ఉంది. అందరు మూకుమ్మ డిగా స్వార్దం అనే మార్గంలో వెళుతున్నారు. వారు కావాలన్న ఆ మార్గం నుండి బయటకు రాలేని పరిస్ధితి. అన్నింటికి ఒక్కటే పరిష్కారం అదే దేవుని సత్య మార్గం. మానవ జీవితాలకు వేరే దారే లేదు. ఏదిపడితే అది దేవుని మార్గం మరియు దేవుని సేవ అవదు. దేవుని వాక్యానుసారమైనది మాత్రమే. అదే దేవుని సత్య మార్గం. కాని ఇక్కడ ఒక problem ఉంది. నిజ దేవుని మార్గం already కొంతమంది మోసగాళ్ల వలన దాని యొక్క విలువ ప్రతిష్ట దెబ్బతిన్నాయి. చాలా మందికి నీతి న్యాయాల మీదను అసలు దేవుని మీదే interest లేకుండా పోయింది. "ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొను వారైయుండి, దొంగ అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్లగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియలచొప్పున వారికంతము కలుగును."(2 కోరింథీ 11: 13-15)

         దేవుని మార్గన్ని క్రమంగా వెతుకుతు తెలుసుకొంటు పరిశీలుస్తు అవలంభిస్తు దేవుడు నీ జీవితాన్ని సృజించుటలో గల ఆ గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చాలని కోరుకొంటున్నాను. దేవుడు మిమ్మును Spiritual గాను మరియు Physical గాను ఆశీర్వదించును గాక!