సంపాదకీయం

12/03/2010 22:56

 

ప్రియమైన పాఠకులకు, 

దేవుని నామమున మీ అందరికి శుభములు. 

         ఈ సంచికలోని ఆర్టికల్స్ క్రైస్తవులకు ప్రాధమిక సత్యాలు. ఇవి చదివి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ బైబిల్ మీకు స్పష్టంగా అర్ధమౌతుంది. ఎవరు పుట్టకతో క్రైస్తవులవరు. క్రైస్తవులంటే యేసుక్రీస్తు శిష్యులు. సువార్త, మారుమనస్సు, తిరిగి జన్మించుట, పరలోకరాజ్యము, దేవుని రాజ్యము- అంటే ఏమిటి? క్రైస్తవులవ్వాలంటే వారికి ఇవి తెలిసుండాలి. సువార్త తెలియకపోతే క్రైస్తవులే కాదు. రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే ఈ లోక సంబంధమైన భాధలనుంచో లేదా అపాయముల నుంచో సురక్షితముగా ఉండగలగటం కాదు. రక్షణ అంటే ఆత్మసంభంధమైన శిక్షనుండి తప్పించబడి దేవుడు వాగ్దానము చేసిన నిత్యజీవమును పొందుకోవటం. మానవుడు రక్షణ పొందుటకు ఏమి చేయవలెను? ముందుగా మనకు రక్షణ ఎందుకవసరమో గుర్తించవలెను.

        మనం ఎంత భయంకరమైన ప్రపంచంలో జీవిస్తున్నామో మరియు ఎంత భయంకరంగా ఆలో చిస్తునామో గుర్తించాలి. ఎవరికి ఏది తోస్తే అదే మంచి. మాట ద్వారా చూపు ద్వారా ఆలోచనల ద్వారా ప్రవర్తనల ద్వారా ఎంత భయంకరమైన పాపాలు చేస్తున్నామో గుర్తించాలి. ఈ ప్రపంచంలో పరిశుద్ధత అనేది ఒకటుందని అది పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి కలుగుతుందని గ్రహించవలెను. ప్రకృతి సంభంధియైన మానవునికి దేవుని విషయాలు అర్ధంకావు “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి; అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు (1 కొరింథి 2:14)” . Basic గా మనం పాపులమని గుర్తించాలి.

        చిన్ననాటి నుండి అంటే మనకు తెలియని వయస్సు నుండి దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ భయంకరమైన పాపపు అలవాట్లతో ఎల్లప్పుడు స్వార్ధపూరితమైన ఆలోచనలతో జీవిస్తున్నామని గుర్తించవలెను. వివాహం మరియు కుటుంబ జీవితము అనే వాటికి అర్ధం లేకుండా పోయింది. నాకు “పరిశుద్దత అంటే ఏమిటో తెలియాలి! మరియు నాకు పరిశుద్ద జీవితం కావాలి”  అన్న కోరిక కలగాలి. కేవలం ఈ లోకంలో నేను నా వారు బాగా బతకాలి అని స్వార్ధంగా ఆలోచించకూడదు. పరిశుద్ద జీవితం కొరకైన తృష్ణ ఎప్పుడు కలుగుతుందంటే –కేవలం దేవుని నిజమైన సువార్తను అర్ధంచేసుకొన్నప్పుడు మాత్రమే. దేవుని సువార్త నిన్ను దేవుని జీవమార్గం దిశగా నడిపిస్తుంది. పరిశుద్ద జీవితానికి ఇదే Starting point. ఆ తరువాత జీవితం ఈ విధంగా సాగుతుంది :-  నిజసువార్త —> పశ్చాత్తాపం —>విశ్వాసము —>మారుమనస్సు —>బాప్తిస్మము—>తిరిగి జన్మించుట—>దేవుని రాజ్యము. 

         కనుక ప్రతిరోజు దేవుని వాక్యానికి సమయం కేటాయించి చదవండి మరియు study చేయండి. దేవుడు మిమ్ములను దీవించును గాక! 

 

 P.S:  ఈ website లో దేవుని ప్రాధమిక సత్యాలను పొందుపరిచాము. క్రైస్తవులకు ఇవే మూలము . కాబట్టి మీరు మీ బైబిల్ తో పాటు చదవండి. ఇవి తెలియకుండా ఎవరూ క్రైస్తవులవరు. సువార్త, దేవుని రాజ్యము, బాప్తిస్మము మొదలైనవి Christian fundamentals “కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములనుగూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును మృతుల పునరుత్థా నమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.” (హెబ్రి 6:1,2). కాబట్టి. మీరు చదవండి. మీరు ప్రేమించినవారి చేత చదివించండి. దేవుడు మిమ్మును దీవించును గాక!   — ఎడిటర్.