సంపాదకీయం

09/05/2010 09:46

ప్రియమైన పాఠకులకు,

            దేవుని నామమున మీ అందరికి శుభములు.

యేసుక్రీస్తు సువార్తను ప్రకటించెను. యేసు తన 3 1/2 సంవత్సరాల సేవలో కేవలం 12 మంది శిష్యులను ఏర్పరచుకొన్నాడు. అనేకమైన దేవుని సత్యవిషయాలను బోధించెను. తరువాత శిష్యులను ఆ సేవను ప్రపంచమంతా ముందుకు కొనసాగించమని ఆజ్ఞాపించెను.

            దేవుని వాక్యం, అంటే బైబిల్ మనకు ఇయ్యబడింది. బైబిల్లో లేని విషయాలను బోధిస్తే అది అబద్ధబోధ. ప్రస్తుత అంత్యదినాలలో మనుషులు విపరీత ధోరణులు, పోకడలు పోతున్నారు. నలుగురు నమ్మితే అది అసత్యమైన సరే సత్యముగానే పాటిస్తున్నారు. అంతేగాని సత్యాన్వేషణ ఎవరు చేయడం లేదు. ఆలోచించే పద్దతిలో మార్పు రావాలి. దేవుని వాక్యమే సత్యం.

            గమనించండి! దేవుని వాక్యంలో లేని వాటిని పాటించేవారు అందరు తప్పాలేదా దేవుని వాక్యం తప్పావారందరు తప్పు అవచ్చు గాని దేవుని వాక్యం ఎన్నటికి తప్పు అవదు.

            దేవుడ ఈ అనంత సృష్టిని సృష్టించాడు. దానిని యేలుటకు మొదట దేవదూతలను నియమించెను. కాని అవి విఫలమైనాయి. దేవుని క్యారక్టర్ కలిగిన వారు తప్ప ఎవరు ఈ విశ్వాన్ని యేలుటకు పనికిరారని దేవుడు మానవులను సృష్టించాడు. అర్హులైన మానవువులలో తన సొంత క్యారక్టర్ నిర్మించుకొంటున్నాడు. మానవులను తన కుమారుని పంపి తన కుమారులగా తన కుటుంబములో చేర్చుకొంటున్నాడు. అంతే మట్టి శరీరులైన మానవులకు దేవుడు నిత్యజీవమును అనుగ్రహించాడు.

            అందుకే మానవులను సృజించి వారు జీవించటానికి తన వాక్యమును ఇచ్చాడు. ఈఅంత్యదినాలలో మానవులు తమ జీవిత ఉద్దేశ్యమును పూర్తిగా విస్మరించారు. వివాహం మరియు కుటుంబం అనేవి అదుపుతప్పి తప్పుదోవ పట్టినవి.అందరు డబ్బుచుట్టే తిరుగుతున్నారు. విశ్వాసులు, సంఘాలు, నాయకులు అందరు డబ్బుఅనే దేవుడుని మాత్రమే ఆరాధిస్తున్నారు.

            అన్యాయస్తుడిని ఇంకా అలానే ఉండనియ్యండి. నీతిమంతుడిని ఇంకా నీతిగానే ఉండనియ్యుడి. అయితే ఎవరునూ కంగారుపడనవసరం లేదు. ఎవరిజీతం వారు పొందుకుంటారు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.” (ప్రకటన 20:11,12)

            దేవుడు మిమ్ములను దీవించును గాక!