సత్‌క్రియలు

01/09/2017 14:47

 క్రైస్తవులు చేయుటకై దేవుడు సిద్ధపరచిన  సత్ క్రియలు ఏమిటి? దేవునికి పూర్తిగా లోబడటం , పూర్తిగా విధేయత చూపించడమే దేవుడు మానవుడికి నిర్ణయించిన సత్ క్రియలు. క్రీస్తు జీవితం అదే మనకు భోదిస్తుంది. విషయం అర్ధం అయితేనే  క్రియలు రూపంలో కనిపిస్తుంది.

 

సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైయుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.  (మొదటి తిమోతికి 6:19)

 

మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. (గలతీయులకు 6:9)

 

దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు(ఆయన మాకు పరిచయం లేదు అన్నట్టు). (తీతుకు 1:16)

 

మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియై యున్నాము. (ఎఫెసీయులకు 2:10)

 

నీవు సత్క్రియ చేసిన  యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. (ఆదికాండము 4:7)

 

మరియు ఆమె(సంఘ వధువు) ధరించు కొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. (ప్రకటన గ్రంథము 19:8)

 

అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. (మొదటి పేతురు 2:12)