5వ పరిశుద్ధ దినం –ప్రాయశ్చిత్తార్ధ దినము

12/03/2010 22:02

 

తరువాత వచ్చు పరిశుద్ధదినం ప్రాయశ్చిత్తార్ధ దినము. 7వ నెల 10వ తారీఖున ఈ దీనిని ఆచరించవలెను. ఈ దినమున అందరు ఉపవాసము ఉండవలెను. అందరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు. ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరి శుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.”(లేవి 23:27). దేవుడు తన కుమారుని మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తార్ధ బలిఇచ్చినాడు. కనుక దేవుని గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు బలియాగమును మనము గుర్తుచేసుకొని దుఃఖపడవలెను. ఈ లోక పాపము మొత్తం యేసుక్రీస్తు మీద మోపబడింది. ఇది సామాన్యమైన విషయం కాదు.

        మానవులను పరిశుద్దులునుగా, దేవుని కుమారులునుగా, నిత్యజీవమునకు వారసులుగాను చేయుటకు దేవుడు తన అనంతజ్ఞాన ప్రణాళికలో తన కుమారున్ని బలి ఇచ్చినాడు. ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకోవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16). దుఃఖపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. ఇది మహా విశ్రాంతి దినము. అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు

 విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.”(లేవి 23:32).

            ఈ పరిశుద్ధదినం దేవుని గొప్ప ప్రణాళికను తెలియజేస్తుంది. దేవుడు మానవుడు కలసి సహవాసం చేయడం సాద్య మైనదని తెలియజేస్తుంది. వారి సహవాసం ఇక ఎన్నటికి అంతము లేనిదైయుండును. దేవునికి మానవునికి మధ్య పాపం ద్వారా ఏర్పడిన అగాధం తొలగిపోయింది. దీనినే ఇంగ్లీష్ లో Day of Atonement అని అంటారు. అందుకే ఈ పండుగ యేసుక్రీస్తు రెండవ రాకను తెలియ జేసె బూరధ్వని పండుగ తరువాత వస్తుంది.