7వ పరిశుద్ధ దినం – చివరి మహాదిన పండుగ

12/03/2010 22:06

         గుడారాల పండుగ మరుసటి దినమున ఈ పండుగను ఆచరించవలెను. అంటే 7 దినములు గుడారాల పండుగ ఆచరించిన తరువాత 8వ దినమున అందరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైనయే పనియు చేయకూడదు.”(లేవి 23:36). యేసుక్రీస్తు ఈ పండుగను యెరుషలేములో ఆచరించెను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి - ఎవడైన దప్పిగొనిన యెడల నాయెద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.”  (యోహాను 7:37).

            ఈ ఆ పండుగ దేవుని యొక్క చివరి తీర్పును సూచిస్తుంది. యేసుక్రీస్తు రెండవరాకతో సంఘము యొక్క మొదటి పునరుద్దానము జరిగి వెయ్యేండ్ల రాజ్యం మొదలౌతుంది. వీరికి తీర్పు లేదు. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసమంచువాడు నిత్యజీవము గలవాడై యున్నాడు; వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోకి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాచు. ” (యోహాను 5:24). వీరికి రెండవమరణం లేదు. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.”(ప్రకటన 20:6).

          తరువాత దేవుని రాజ్యము చివరలో యేసుక్రీస్తు తీర్పు జరుగును. ఆదాము మొదలుకొని దేవునికి విధేయులు కాని వారందరు సమాధులలో నుండి బయటకువచ్చి దేవుని తీర్పు పొందుతారు. మరియు ఆయన మనుష్యకుమారుడు గనుక తీర్పు తీర్చుటకును (తండ్రి) ఆయనకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది; కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసిన వారు జీవపునరుత్థానము నకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”(యోహాను 5:27-29).

            తీర్పు పొందినవారు నిత్యజీవానికి లేదా రెంవవ మరణానికి వెళతారు. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును నశించిపోతారు. “(పాపాన్ని) జయించువాడు వీటిని(నిత్యజీవమును) స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండుగుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము”.(ప్రకటన 21:7,8).

            ఈ ఆ పండుగతో మానవులపట్ల దేవునికున్న మహత్తర ప్రణాళిక ముగుస్తుంది. శరీరసంబంధులైన మానవులు ఇకఉండరు. అందరు యేసుక్రీస్తు మాదిరిగా ఆత్మసంబంమైన శరీరాలతో దేవునితో పాటు(ఖాళీగా సమయాన్ని గడపరుగాని) యుగయుగాలు పరిపాలన చేయుదురు. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.”(ప్రకటన 22:5).