**********************************************************************************************************************************

కొంచెం ఆలోచించండి

 

ప్రతి మానవ జీవితం తాత్కాలికమైనది. ప్రపంచం అనే దేవుని కంపెనీలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం లాంటిది. బాగా పని చేస్తే ఉద్యోగం(జీవితం) పర్మినెంట్ అవుతుంది. అంటే జీవితం ఎందుకు ఇయ్యబడినదో తెలుసుకొని అలా జీవిస్తే అది నిత్యజీవితం పొందుకొంటుంది. లేనిచో కాంట్రాక్ట్ ఉద్యోగం వలె తాత్కాలిక జీవితం తొలిగించబడుతుంది. అంటే ఇది శిక్ష కాదు. కేవలం జీవితానికి అంతం మాత్రమే.

 

జీవితం ఎందుకు ఇయ్యబడినది? అసలు ప్రశ్న ఇదే. కేవలం దేవుని సంబంధులందరు ఈ ప్రశ్న వేస్తారు మరియు జవాబు ఖచ్చితంగా పొందుకొంటారు.

**************************************************************************************

Every human life is like a contract job(temporary life) in the God's MNC company(Endless Universe). If the performance is good(a Life without sin) then it will get converted to permanent(Eternal life). Otherwise it(temporary human life) will be terminated or fired(in hell).

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

నిజమైన క్రైస్తవులను గుర్తించవచ్చా?

“శరీరానుసారులు శరీరవిషయములను మనస్కరింతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావముగల వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున మీరు ఆత్మస్వభావముగలవారే గాని శరీరస్వభావముగలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు.” (రోమీయులకు 8:5-9)

 

1. శరీరానుసారులు ఎవరు?

దేవుని ఆత్మ పొందని వారు.    (కేవలం ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి వాటి కష్టసుఖాలను గూర్చి మాత్రమే ఆలోచించేవారు. వీరు దేవుని నియమాలను ఆజ్ఞలను గూర్చి ఏమాత్రము పట్టించుకోరు, ఇష్టపడరు మరియు అతిక్రమిస్తారు.)

2. ఆత్మానుసారులు ఎవరు?

దేవుని ఆత్మ పొందిన వారు.   (కేవలం ఈ పరలోక సంబంధమైన విషయాలను గూర్చి వాటి కష్టసుఖాలను గూర్చి మాత్రమే     ఆలోచించేవారు. వీరు దేవుని నియమాలను ఆజ్ఞలను పాటించి ఈ లోకంలో జీవిస్తారు.)

3. శరీరానుసారమైన మనస్సు మరణము. అంటే  ఏమిటి?

 దేవుని ఆత్మ పొందని వారి యొక్క మనస్సు.   (దేవుని నియమాలను ఆజ్ఞలను అతిక్రమించి కేవలం అక్రమంగా ఈ లోక సంబంధమైన సుఖాలను ఆనందాలను ఆశించేది శరీరానుసారమైన మనస్సు. ఇలాంటి మనస్సు కలిగినవారు ఆత్మసంబందమైన జీవితం పొందనేరక మరణిస్తారు.)

4. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. అంటే  ఏమిటి?

దేవుని ఆత్మ పొందిన వారి యొక్క మనస్సు.  (దేవుని నియమాలను ఆజ్ఞలను పాటించి కేవలం ఈ పరలోక సంబంధమైన జీవితాన్ని ఆశించేది ఆత్మానుసారమైన మనస్సు. ఇలాంటి మనస్సు కలిగినవారు ఈ లోకంలో సమాధానం కలిగియుండి ఆత్మసంబందమైన జీవితాన్ని పొందుకొగలుగుతారు.)

5. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రమును లోబడనేరదు ఎందుకు?

దేవుని ఆత్మ పొందని వారి యొక్క మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రమును లోబడనేరదు ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది మరియు ఆత్మసంబంధమైనది.(రోమా 7;12,14)  (కేవలం అక్రమంగా ఈ లోక సంబంధమైన సుఖాలను ఆనందాలను పొందాలనుకొనేవారికి ధర్మశాస్త్రము వ్యతిరేకం.)  

6. దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున మీరు ఆత్మస్వభావముగలవారు. ఎలా?

దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున  మీరు యేసుక్రీస్తు స్వభావము కలిగియుండి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఉత్తమమైనవారుగా ఈ లోకంలో జీవిస్తారు. 

7. దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున మీరు శరీరస్వభావముగలవారు కారు. ఎలా?

దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున  దేవుని నియమాలను ఆజ్ఞలను అతిక్రమించి కేవలం అక్రమంగా ఈ లోక సంబంధమైన సుఖాలను ఆనందాలను ఆశించే శరీరస్వభావము మీలో ఉండదు.

8. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు. ఎలా?

క్రీస్తు ఆత్మ లేదా దేవుని ఆత్మ పొందని వారు క్రైస్తవులు కారు.

పైన తెలిపిన ప్రశ్నల ఆధారంగా నిజమైన క్రైస్తవులను గుర్తించవచ్చు.

*****************************************************************************

దేవుని పరిశుద్ధ పండుగలు

సంవత్సరం

దేవుని క్యాలెండర్

మొదటి రోజు

పస్కా పండుగ

పులియని రొట్టెల పండుగ

పెంతెకొస్తు పండుగ

2012

మార్చి 24

ఏప్రిల్ 6

ఏప్రిల్ 7-23

మే 27

2013

మార్చి 12

మార్చి 25

మార్చి 26- ఏప్రిల్ 1

మే 19

2014

ఏప్రిల్ 1

ఏప్రిల్ 14

ఏప్రిల్ 15-21

జూన్ 8

2015

మార్చి 21

ఏప్రిల్ 3

ఏప్రిల్ 4-10

మే 24

2016

ఏప్రిల్ 9

ఏప్రిల్ 22

ఏప్రిల్ 23-29

జూన్ 12

 

 

సంవత్సరం

బూరలధ్వని పండగ

ప్రాయశ్చిత్తార్ధ దినము

గుడారాల పండుగ

చివరి మహాదిన పండుగ

2012

సెప్టెంబర్ 17

సెప్టెంబర్ 26

అక్టోబర్ 1-7

అక్టోబర్ 8

2013

సెప్టెంబర్ 5

సెప్టెంబర్ 14

సెప్టెంబర్ 19-25

సెప్టెంబర్ 26

2014

సెప్టెంబర్ 25

అక్టోబర్ 4

అక్టోబర్ 9-15

అక్టోబర్ 16

2015

సెప్టెంబర్ 14

సెప్టెంబర్ 23

సెప్టెం 28 – అక్టో 4

అక్టోబర్ 5

2016

అక్టోబర్ 3

అక్టోబర్ 12

అక్టోబర్ 17-23

అక్టోబర్ 24

 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

యేసుక్రీస్తు సువార్త కలుషితం చేయబడింది. కలుషితమైన సువార్త ద్వారా ఎవరు దేవుని రాజ్యము చేరరు. అంటే ఈ లోకంలో పెద్ద వారు, పండితులు, గొప్పవారు, భక్తులు మొదలైనవారు ఎన్నో యేళ్లనుండి ప్రకటిస్తున్నది అంతా తప్పా? అని చాలా మంది అడుగుతుంటారు. అందరు గ్రహించవలసింది యేమిటంటే దేవుని వాక్యము తప్పా? లేదా మనుషులు తప్పా? దేవుని వాక్యం ఎన్నడు తప్పవదు. దేవుని వాక్యంలో లేని ఏ భోద అయిన లేదా ఏ పండుగయైన లేదా ఏ పద్దతియైన అది అబద్ధ భోదే. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”(గలతి 6:7)  చెవులు కలిగిన వాడు వినును గాక!

యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త

  1. వారం వారం చర్చీకి వెళితే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  2. వారం వారం చందా ఇస్తే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  3. రోజు బైబిల్ చదివితే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  4. రోజు ప్రార్థన చేస్తే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  5. బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  6. స్వస్థత పొందితే/కార్యాలుచేస్తే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  7. ఇతరులకు సహాయం చేస్తే పరలోక రాజ్యానికి వెళతారా? లేదా

  8. దేవుని సేవ చేస్తే పరలోక రాజ్యానికి వెళతారా?

          మరి ఏం చేస్తే దేవుని రాజ్యానికి వెళతారు. యేసుక్రీస్తు 33½ సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాడు. అందులో 3½ సంవత్సరాలు సేవ చేసినాడు. తన పరిచర్య ఒక శుభవార్తతో ప్రారంభించాడు. ఆ శుభవార్త తెలుసుకొని, నమ్మి, ఆయన యందు విశ్వాసముంచి, పరిశుద్ధ జీవితము జీవించువారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారని దేవుని వాక్యం చెపుతుంది. ఇది కాకుండా ఏమి చేసినా దేవుని రాజ్యమును ప్రవేశం ఉండదు. మరి ఆయన తన 3½ సంవత్సరాలు సేవలో ప్రకటించిన సువార్త నీవు ఎప్పుడైనా విన్నావా? సువార్తంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు కాదు. ముందుగా జరుగబోయే దానిని గురించి ఆయన ప్రకటించినదే సువార్త. ప్రస్తుతం లోకంలో అనేక సువార్తలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త మాత్రం వినబడుట లేదు. మరి ఆయన ప్రకటించిన సువార్త నీవు ఎప్పుడైనా విన్నావా?

          యేసుక్రీస్తు ప్రకటించిన నిజమైన సువార్త తెలుసుకొనదలచిన వారు మాకు రాయండి. నిన్ను రక్షించు సువార్త అను మా చిన్న పుస్తకమును ఉచితంగా పంపిస్తాము.

++++++++++++++++++++++++++++++++++++++++++

సువార్త కలుషితం చేయబడినది

మానవుని చేతినుండి తప్పించుకొని కలుషితం కాకుండా ఈ ప్రపంచములో ఏమిలేదు. ఆహారం, నీరు, గాలి, మొదలైనవి అన్నీ కలుషితమైపోయాయి. మానవులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నింటిని కలుషితం చేస్తున్నారు. చివరకు యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త కూడా కలుషితం చేయబడినది. యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తకు బదులుగా అనేకమైన నకిలీ సువార్తలు ఈ రోజున పెద్దయెత్తున ప్రచారంలో ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త మీరు ఎపుడైన విన్నారా?

          యేసుక్రీస్తు కేవలం 33½  సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించాడు. అందులో తాను 3½ సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేసినాడు. అంటే దేవుడు తనకు అప్పగించిన పని చేసినాడు. ఆ పరిచర్యలో మానవులందరికి ఒక మంచి శుభవార్తను ప్రకటించినాడు. ఆ శుభవార్త భూసంబంధమైన లేదా శరీరానుసారమైన వాటిని గూర్చి కాదు. కేవలం ఆత్మ సంబందమైన ఆశీర్వాదాలను గూర్చినదియే ఈ శుభవార్త.

నకిలీ :   యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త కాకుండా మిగతావన్నీ నకిలీ సువార్తలే. దేవుని వాక్యంలో లేని ఏ భోధ అయినా అది అబద్ధ భోధే. ప్రాముఖ్యమైన అంశము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఏది విని విశ్వసించినను దేవుని రాజ్యము చేరము. తండ్రియైన దేవుడు తన ప్రియకుమారుడును ఈ లోకముకు సువార్తను ప్రకటించుటకే పంపెను. “ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమేగదా నేను పంపబడితినని వారితో చెప్పెను.”(లూక 4:43). సువార్తను నమ్మి విశ్వసించినవారు పరిశుద్దులగుటకు, పాప క్షమాపణ నిమిత్తము ఆయన అందరి కొరకు మరణించెను. సువార్తను విశ్వసించిన తరువాతే పాప క్షమాపణ. అంటే పాపక్షమాపణ సువార్త కాదు. అది నకిలీ సువార్త. కాబట్టి, యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తను ముందు విను, లేదా చదివి తెలుసుకొనుము. అసలు ఆయన ఏమి ప్రకటించాడో తెలుసుకోవాలి. అప్పుడే ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు అనేకమైన అద్బుత కార్యములు చేసినాడు. కాని అవి కూడా సువార్త కాదు.

దేవుని కోపం :  ఈ లోకంలో పాపం బహుగా విస్తరిచింది. ఇది కృపాకాలం. దేవుడు అందరిని ప్రేమిస్తు అందరి ఎడల దయ, జాలి చూపుచున్నాడు. అలా అని దేవుడు పాపమును ఎంతమాత్రము ఒప్పుకోడు. సకల విధములైన పాపములపైన దేవుని కోపం రగులుకొంటుంది. దేవుని ఎదుట పశ్చాతాపం చెందకపోతే పాపమునకు శిక్ష తప్పదు. దేవుని పరిచర్య చేస్తున్నామని చెప్పుకొంటు దేవుని పిల్లలను దేవునికి దూరం చేస్తున్నారేమో పరిక్షించుకొండి. ఏ జీవనోపాధి లేకపోతే దేవుని సేవ అని తిరుగుచున్నారు చాలా మంది. భోధకులకు మరి కఠినమైన తీర్పు. నానా రకాల సువార్తలు తయారైపోయాయి. అసలు యేసుక్రీస్తు సువార్త మరుగున పడిపోయింది. యేసు తన రెండవసారి వచ్చేముందే సమస్తమైన చెడుతనమునకు, పాపమునకు దేవుడు శిక్ష విధిస్తాడు.

ఊహలకందని భవిష్యత్తు : దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చి మానవులందరికి సంక్రమించబోవు ఊహలకందని భవిష్యత్తును గూర్చిన శుభవార్తను ప్రకటించినాడు. మానవ జీవితము ఒక మర్మము, ఒక అద్భుతము, ఒక వరము. ఏవరైనా కావలని కోరుకుంటే వచ్చినది కాదు. అది ఒక దేవుని అద్బుత సంకల్పం. మానవ జీవితానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. అదే యేసుక్రీస్తు సువార్తగా ప్రకటించినాడు. నిజమైన సువార్త నిజమైన మార్పును నీలో తీసుకు వస్తుంది. మారవలసింది మతము కాదు, శారీరక వేషదారణ కాదు. నీ మనస్సు, జీవితం మారాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడిన ఒక గొప్ప మిషనరీ. ఆయన తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి వెళ్ళినాడు. మిగిలినది ఆయన శిష్యులకు అప్పగించినాడు. కనుక ఈ భౌతికమైన జీవితం చాలా చాలా చిన్నది. మరియు తాత్కాలికమైనది. కాని అందరికి ఊహలకందని భవిష్యత్తు వేచి యున్నది.

పిలువబడినవారు-ఏర్పరచబడినవారు : అందరు అంతట మారుమనస్సు పొందవలెనని దేవుడు కోరుచున్నాడు. మనిషి మనిషిగా బ్రతకాలని, హృదయశుద్ధి కలిగిన ఆలోచనలు కలిగియుండాలని ఆయన కోరుచున్నాడు. అందుకే ఆయన తన సువార్త ప్రకటనతో భూలోకవాసులందరిని పిలుచుచున్నాడు. ఎవరైతే ఆయన పిలుపునందుకొని అర్ధం చేసుకొని, తమలో తాము నిర్ణయించుకొని పరిశుద్దులగుటకు అడుగులు వేస్తారో వారే ఏర్పరచబడిన వారౌతారు. తాత్కాలికమైన ఈ భౌతిక జీవితం నుండి శాశ్వితమైన జీవితమునకు అంటే నిత్యరాజ్యమునకు, అంటే దేవుని కుటుంబములోనికి, అంటే దేవుని ప్రభుత్వములోనికి సర్వశక్తి కలిగిన దేవుడు సువార్త ద్వారా అందరిని పిలుచుచున్నాడు. ఆ పిలుపు విలువ నిత్యజీవము. గ్రహించినవారు ధన్యులు. వారు ఈ జీవితంలో దేవుని రాజ్యముకోసం ఏర్పరచబడినవారు. వారు ఈ లోకంలో ఎక్కడ ఉన్నను పరిశుద్ధులుగా ఉంటు పరదేశులవలే యాత్రికులవలే తమ జీవితాన్ని కొనసాగిస్తువుంటారు. “ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక......”(1 పేతురు 2:11).

కలుషితము :  యేసుక్రీస్తు సువార్త కలుషితం చేయబడింది. కలుషితమైన సువార్త ద్వారా ఎవరు దేవుని రాజ్యము చేరరు. అంటే ఈ లోకంలో పెద్ద వారు, పండితులు, గొప్పవారు, భక్తులు మొదలైనవారు ఎన్నో యేళ్లనుండి ప్రకటిస్తున్నది అంతా తప్పా? అని చాలా మంది అడుగుతుంటారు. అందరు గ్రహించవలసింది యేమిటంటే దేవుని వాక్యము తప్పా? లేదా మనుషులు తప్పా? దేవుని వాక్యం ఎన్నడు తప్పవదు. దేవుని వాక్యంలో లేని ఏ భోద అయిన లేదా ఏ పండుగయైన లేదా ఏ పద్దతియైన అది అబద్ధ భోదే. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”(గలతి 6:7)  చెవులు కలిగిన వాడు వినును గాక!

          కాని ఇప్పుడు మీరు నిజమైన దేవుని సువార్తను తెలుసుకొన వచ్చును.

***********************************************************

దేవుని ప్రభుత్వం

                        యేసుక్రీస్తు రాజుగా దేవుని ప్రభుత్వము రానైయున్నది. ఆయన పరిశద్ధ శిష్యులే ఆ ప్రభుత్వంలో పాలకులు. ఇదే యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త. “ఆయన - నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే గదా నేను పంపబడితినని వారితో చెప్పెను (లూకా 4:43)”.  ఇది ప్రజాసామ్య ప్రభుత్వం కాదు. ఇది రాజరిక ప్రభుత్వం. ఇది ఈ లోక సంభందమైన ప్రభుత్వము కాదు. మానవులు ప్రభుత్వాల వంటిది కాదు. ఇది అంతములేని ప్రభుత్వము. “అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. (దానియేలు 7: 17,18)”. పరిశుద్ధులు, ఆత్మసంబంధంగా తిరిగి జన్మించిన వారు, నిత్యజీవం పొందినవారు, మరణం లేనివారు ఈ యొక్క ప్రభుత్వములో పాలకులు. వీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా ఈ దేవుని ప్రభుత్వమే.  “జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. (లూకా 9:11)”.

                      ఆయన తన మొదటి రాకలో వచ్చి, తన ప్రభుత్వములోకి(రాజ్యములోకి) రాజులుగా మరియు యాజకులుగా ఉండుటకు మానవులను పిలిచినాడు(ఆహ్వానించినాడు). “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. (1 పేతురు 2:9)”. తన రెండవ రాకతో ఆయన ప్రభుత్వము మొదలౌతుంది. కాని మానవులు అర్హతలేని పాపులు. అందుకే ముందుగా తన మరణం ద్వారా పాప పరిహారం చేసి మానవులు పరిశుద్ధులవుటకు అర్హులుగా చేసినాడు. “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది”(కొలస్సి 1:13, 14). ఇప్పుడు ఎవరైతే ఆయన మాట విని, విశ్వసిస్తారో వారు నిత్యజీవం పొందుకుంటారు మరియు వారే ఆయన ప్రభుత్వములోకి వస్తారు. ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఇదే యేసుక్రీస్తు ప్రకటించిన రాజ్యసువార్త.

                    ఆయన రెండవరాకలో వచ్చినప్పుడు మొదటి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన జరుగును. చనిపోయిన పరిశుద్ధజనము ముందుగా పునరుత్థానము చెందుతారు. ఆ తరువాత బ్రతికియున్న  పరిశుద్ధజనము పునరుత్థానము చెందుతారు. యేసుక్రీస్తు రాజులకు రాజుగా ఆయన శిష్యులు రాజులుగా ప్రభుత్వము చేస్తారు. వీరినే ప్రధమ ఫలాలంటారు. “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయందురు ఇట్టివారిమీద రెండవ మరిణమునకు అధికారములేదు; ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యముచేయుదురు.”(ప్రకటన 20:6).  పాలింపబడు వారు మానవులే. 1000 సంవత్సరాల తరువాత మరి కొంతమంది ఆయన ప్రభుత్వమలోకి చేర్చబడతారు. వీరు నిత్యజీవము పొందుకుంటారు కాని ప్రధమ ఫలములవంటి ఆధిక్యత ఉండదు. తరువాత ఈ ప్రభుత్వము తండ్రియైన దేవునికి అప్పగించబడి సృష్టి యావత్తుకు విస్తరింపబడుతుంది. “అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.” (1 కొరింథి 15:24)

                      ఈ ప్రభుత్వములోకి వచ్చేవారందరు నిత్యజీవము కలవారు. మరి మిగిలినవారి పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు సువార్తను ఒకసారైన వినని వారు, విని కూడా విశ్వసించనివారు, లేదా అబద్ధబోధ విని మోసపోయిన వారి పరిస్థితి ఏంటి? ఆదాము మొదలుకొని 1000 సంవత్సరాల రాజ్యము అంతము వరకు ఈ ప్రభుత్వములో చేరని వారి పరిస్థితి ఏంటి? దేవుడు ప్రేమకలిగినవాడు. ఆయన అందరిని సమానంగా  ప్రేమిస్తున్నాడు. ఇలాంటి వారందరికి ఒక మంచి అవకాశము ఉంది. 1000 సంవత్సరాల రాజ్యము అంతములో వీరందరు భౌతికంగా బ్రతికింపబడతారు. (ఉ.దా యేసుక్రీస్తు లాజరును బ్రతికించినట్లు). అప్పుడు చివరిసారిగా ఈ రాజ్యసువార్త వీరికి ప్రకటింపబడుతుంది. అప్పుడు విశ్వసించిన అనేకులు దేవుని ప్రభుత్వములోకి (రాజ్యములోకి) చేర్చబడతారు. ఇంకా విశ్వసించని వారు మరియు ఒకప్పుడు విశ్వసించి వెనుకకు తిరిగినవారు మహాతీర్పులోనికి వెళ్ళి ఆ తరువాత నరకములో(అగ్నిలో) నశించి పోతారు.

                      నిత్యజీవం పొందిన మానవులందరు యేసుక్రీస్తుతో పాటు యుగయుగాలు ప్రభుత్వము చేయుదురు. “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను.”(ప్రకటన 3:21). దేవుని రాజ్యము అంతములేనిదై చిరకాలము ఈ యావత్తు సృష్టిని పరిపాలిస్తుంది.

*****************************************************************************************

 

ఇవి అంత్యదినాలేనా?

                        రాత్రి చాలా గడచి తెల్లవారుటకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది, ఈ లోకం పరిస్థితి. దేవుని రెండవ రాకడ గుర్తులు మన కళ్లముందే జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన స్వార్ధం కనబడు తుంది. డబ్బు మరియు వ్యాపారం అనే ధోరణితోనే ఈ ప్రపంచం నడుస్తున్నది. క్షణం క్షణం ఏ జరుగుతుందో అంతు తెలియకున్నది. మానవ జీవితాలు క్షణాల్లో కళ్లముందే గాలిలో కలిసిపో తున్నాయి. అనురాగం, ఆప్యాయత మరియు ప్రేమ మొదలైనవి అన్ని కలుషితమైపోయాయి. 20 యేళ్లక్రితం ఉన్న మానవ దృష్టికోణం ఇప్పుడు లేదు. అంతా తలక్రిందులైపోయాయి. సమీకరణాలు క్షణాల్లో మారుతున్నాయి. ఎ సంభంధం ఎప్పుడు తెగిపోతుందో, ఎ సంభంధం ఎప్పుడు ఏర్పడు తుందో తెలియని విచిత్ర కాలంలో మనం జీవిస్తున్నాము. సంపూర్తిగా అనిశ్చితి నెలకొనియుంది.

                        ప్రస్థుతం అన్ని కొనబడును మరియు అన్ని అమ్మబడును. మానవులు ఏదైనా కొనటానికి లేదా అమ్మటానికి సిద్ధం. తన మన బేధం లేదు. మానవుల తుచ్చమైన కోరికలకు వావివరుసలే లేవు. నియమ నిబంధనలు చాలా ఉన్నాయి కాని పాటించేవారే అసలే లేరు. ఎవరు ఎంత ఎక్కువగా మోసం చేస్తే వారు అంత తెలివిగలవారుగా ప్రస్తుతం ఎంచబడు తున్నారు. అనేకమంది దేవుని పేరునే వారి స్వార్థ వ్యపారాలకు వాడుకుంటున్నారు. అడ్డు అదుపులేని లోకాన్ని మన చూస్తున్నాం. ఇవే అంత్యదినాలు.

                        ఎవరికి భయం లేదు. భక్తి లేదు. దేవుని పైన విశ్వాసం తెలియదు. తన పబ్బం గడుపు కోవటానికి దేనికైన తెగించటానికి సిద్ధపడుతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి. కొత్త కొత్త రోగాలు కూడా వచ్చాయి. విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. ఎంటర్ టైన్మంట్(వినోదం) అనే మాయలో పడేసి మానవులను వెర్రివాళ్లను చేస్తున్నారు. కొందరి జీవితాలే నాశమైపోతున్నాయి. మానవునికి ఒక ఫ్యుచర్(నిరీక్షణ) లేదు. ఒక గతి గమ్యం లేదు. అందుకే ఈ రోజున ప్రతి సెకనుకి ఒకరు ఆత్మహత్య చేసుకొంటున్నారు.

                        ఇలా ఎందుకు ప్రపంచం ఎందుకు మారిపోయింది అంటే ఇవి అంత్యదినాలు. కేవలం దేవుని యొక్క ఉగ్రత రుచిచూడటం కోసమే ఈ తరము ఇలా తయారైంది. ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు. దేవుని ఉగ్రతనుండి కేవలం నిజ దేవుని సంఘ విశ్వాసులు మాత్రమే తప్పించ బడతారు. వారు దేవుని పరిశుద్ధులు.  చెవులుగలవాడు వినును గాక!  ◌

************************************************************************************

ఏమి తెలియదు

                    మనకు ఏది తెలియదో, ఆ తెలియదనే సంగతి కూడా తెలియదు. మనము జన్మించినపుడు మనకు జీరో నాలెడ్జ్. ఇక ఆలోచించే వయస్సు వచ్చేసరికి ఏ నాలెడ్జ్ బుర్రలోకి వచ్చిందో తెలియదు. ఏదో జన్మించాము. చనిపోయేదాక బ్రతకాలి కదా అనట్లు బ్రతికేస్తాం. ఏదో ఒకటి చేసి బ్రతక్కపోతే మళ్లా నలుగురి లో నామోషి. ఇక నలుగురిలో నారాయణ అన్న సామెతలాగా జీవిస్తాము.

                    ఎప్పుడూ... మన దగ్గర లేనిదాని కోసం ఆరాట పడతాము. మన దగ్గర లేకపోయినా లెవెల్ కొట్టి మరి, మాకు కూడ ఉంది అని ఫోజులిస్తాము. మనకు చేతకానిది ఇంకెవరైన చేస్తే ఏడుస్తాము. చివరకు అది ఎవరైనా చేస్తారు అని కవర్ చేస్తాము. ఇంతచేసి చివరకు ఎలాగో బ్రతుకుతుంటే, జీవితంలో మనశ్శాంతి కరువైతుంది. ఇంక మింగలేక కక్కలేక అన్నట్లు ఈ సారికి ఈ జీవితం ఏలాగో అలా తొందరగా గడచిపోతే బాగుణ్ను అని అనిపిస్తుంది. ఎవరైన పుట్టినప్పుడు అందరితో సంతోషం నటిస్తాం. ఎవరైన చనిపోతే అయ్యో పాపం అని అందరితో భాద పడతాం.

                మనకు ఉపయోగపడే వారికి గౌరవమిస్తాం. చక్కగా సంబోధిస్తాం. మన ఉపయోగం ఎవరికైతే ఉందో వారిని ఒక ఆటాడుకుంటాం. మన ఇంట్లో ఎలా ఉన్నా లేదా మన ఆలోచనలు ఎంత చండాలంగా ఉన్నా బయటకు మాత్రం చాలా చక్కగా చూపిస్తాం. ప్రస్తుతం పొజిషన్ బాగా ఉంటే గత జీవితం మర్చి పోతాం. లేకపొతే గతాన్నే పదేపదే అందరికి చెప్పుకుంటాం. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు లైఫ్ తయారౌ తుంది.

                ఏలాగో కష్టపడి చదివి ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించిన తరువాత కూడా ఇదే తంతు. అసలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. విషయం ఏమిటంటే ఈ సంగతులు సరైన కోణంలో చాలామందికి బోధపడేది ముసలి వయస్సులోనే. అప్పటి వరకు కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లే ఉంటుంది.

                ఈ పరిస్థితి కేవలం పేదవారిలో మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరబడట్టే. ప్రస్తుతం చాలావరకు అందరిది ఇదే పరిస్థితి.  బేసిగ్గా మనకి మన జీవితం గురించి ఏమి తెలియదు. మనమెందుకు ఇలా ఉన్నామో అసలే తెలియదు. ఈలాంటి వారినే దేవుని వాక్యం ప్రకృతి సంబంధియైన మానవుడు అంటుంది.(“వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయకాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత  దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచబడినవారై, తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.”(ఎఫెసి 4:18) వీరికి ఏమి తెలియదు, మనస్సు కేవలం భూసంబంధమైన సిస్టమ్ లో కొట్టిమిట్టు ఆడుతూ ఉంటుంది. ఏమైన తెలియాలంటే దేవుని సంఘమునకు వచ్చి నేర్చుకోవలెను. ◌

***************************************************************************************